ల్యాండింగ్ సమయంలో విమానంనుండి జారి దుర్మరణం

విమానాశ్రయం సమీపంలో పార్క్ చేసిన ఓ కారుపై అతడి మృతదేహం పడి ఉంది. మృతి చెందిన వ్యక్తిని గుర్తించడం కష్టంగా ఉందని.. బహుశా టిక్కెట్ వంటివేమీ లేకుండా దొంగచాటుగా విమాంలోకి చొరబడి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి వయస్సు ముప్పయ్యేళ్లు ఉండవచ్చునని చెప్పారు.
అతని మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు వెయ్యి ఫీట్లకు పైగా ఎత్తు నుండి పడిపోయినట్లుగా భావిస్తున్నారు. అతను పడిపోయిన ప్రదేశం హీత్రూ విమానాశ్రయానికి దాదాపు పది మైళ్ల దూరంలో ఉంది. ఇతను ఎవరో ఖచ్చితంగా తెలియనప్పటికీ ఉత్తర ఆఫ్రికా నుండి వచ్చి ఉంటాడని, ఏదైనా సమస్యతో బాధపడుతుండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications