పార్టీని వారికి అప్పంగించండి: బాబుకు గట్టు సలహా

వైయస్ జగన్‌ను అక్రమంగా జైల్లో పెట్టారని ఆయన అన్నారు. ఎల్లో మీడియాకు ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆయన అన్నారు. వైయస్ జగన్‌ను జైల్లో పెట్టించిన శక్తులే ఇప్పుడు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నాయని ఆయన విమర్శించారు. బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చే ప్రతిసారీ ఎల్లో మీడియా అబద్ధపు వార్తలను ప్రచురిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, ఎల్లో మీడియా కుట్రలో భాగంగానే అవుట్ లుక్ కథనం వచ్చిందని ఆయన అన్నారు.
బెయిల్ కోసం తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు ప్రధాని మన్మోహన్ సింగ్‌తో రహస్య చర్చలు జరిపారని, సోనియా గాంధీతో అవగాహనకు వచ్చారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాని రెండు నిమిషాలు విజయమ్మను పలకరిస్తే అది రహస్య అవగాహన కోసమేనని తెలుగుదశం పార్టీ, ఎల్లో మీడియా ప్రచారం చేస్తున్నాయని, చంద్రబాబు ఐదు నిమిషాలు మాట్లాడి అవగాహనకు వస్తే అవగాహన లేదని అంటున్నాయని అన్నారు. జగన్‌కు బెయిల్ రాకుండా చంద్రబాబు ప్రధాని మన్మోహన్‌తో మాట్లాడారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు మన్మోహన్‌తో రహస్య చర్చల్లో భాగంగా పన్నిన కుట్ర బయటకు రావాలని ఆయన అన్నారు.
వైయస్ జగన్‌పై కుట్రలు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. తమకు న్యాయస్థానంపై నమ్మకం ఉందని, న్యాయపోరాటం చేస్తామని ఆయన అన్నారు. ప్రజా కోర్టులో కూడా తాము తేల్చుకుంటామని ఆయన చెప్పారు. ధర్మాన ప్రసాద రావు తనకు జీవోలతో సంబంధం లేదనీ మంత్రివర్గ నిర్ణయం ప్రకారమే జరిగిందని అంటున్నారని, తాము కూడా అదే అంటున్నామని ఆయన అన్నారు. ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదని ఆయన అన్నారు. కుట్రపూరిత ప్రచారాలకు తాము భయపడేది లేదని ఆయన అన్నారు.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications