ఔటర్ ప్రమాదంలో నేత కొడుకుకు గాయాలు: యువతికీ

Hyderabad
హైదరాబాద్: ఔటర్ రింగ్‌ రోడ్డులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కుమారుడు సిద్ధార్థ తీవ్రంగా గాయపడ్డారు. ఆయనతో పాటు కారులో ఉన్న మరో యువతి సంజనకి కూడా గాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడలోని ఔటర్ రింగ్ రోడ్డుపై కారు, లారీ ఢీకొనడంతో వీరిద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన రాత్రి పది గంటలకు చోటు చేసుకుంది.

తుక్కుగూడ నుంచి శంషాబాద్‌కు ఇన్నోవా కారు(ఎపి 9 టివి 789)లో వెళుతున్న సిద్ధార్థ.. రింగ్ రోడ్డులోకి ప్రవేశించి వేగంగా ప్రయాణిస్తూ ముందు వెళుతున్న లారీ(ఎంహెచ్ 25 9659)ని ఢీ కొట్టారు. దీంతో కారులోని వీరికి గాయాలయ్యాయి. మొదట వారిని మహేశ్వరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం జూబ్లీహిల్స్ అపోలోకు తీసుకువెళ్లారు.

ప్రమాదం గురించి తెలియగానే మల్లు రవి, ఆయన అనుచరులు ఆసుపత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. తన కుమారుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని మీడియాకు రవి తెలిపారు. ఈ ఘటనలో కారు ముందు భాగం బాగా దెబ్బతిన్నది. పహాడీషరీఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. విజయవాడ నుండి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+