టాప్ లెస్ కేట్ కేథరీన్: ఇప్పుడు డెన్మార్క్ పత్రిక వంతు

Posted By:
Subscribe to Oneindia Telugu
Kate Catherine
కోపెన్‌హ్యాగన్: బ్రిటన్ ప్రిన్స్ విలియమ్స్ సతీమణి, యువరాణి కేట్ అర్ధనగ్న చిత్రాల ప్రచురణ ఆగటం లేదు. ఇప్పటికే ఫ్రాన్స్, ఐర్లాండ్, ఇటలీ, స్వీడన్‌కు చెందిన పత్రికల్లో అచ్చయిన కేట్ టాప్ లెస్ ఫోటోలు తాజాగా డెన్మార్క్ పత్రికలోనూ ప్రత్యక్షమయ్యాయి. ఫోటోల ప్రచురణపై బ్రిటీష్ రాజ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసినా, స్వయంగా కోర్టు ఆంక్షలు పెట్టినా.. అచ్ఛాదన లేని కేట్ అందాలను అచ్చొత్తే చాన్స్‌ను యూరప్‌లోని ఏ పత్రిక వదులుకునే పరిస్థితి కనిపించడం లేదని చెప్పవచ్చు.

సీ అండ్ హియర్' అనే డెన్మార్క్ పత్రిక ఏకంగా ప్రత్యేక సంచికనే తీసుకొచ్చింది. బికినీ తప్ప వంటిపై మరే అచ్ఛాదన లేని కేట్ చిత్రాన్ని ముఖచిత్రంగా ప్రచురించింది. ప్రత్యేక సంచికలో మొత్తం 36 ఫొటోలు ఉండగా, అందులో 16 ఫొటోల్లో .. సన్‌బాత్ చేస్తున్న కేట్‌ను వివిధ భంగిమల్లో తీసినవే ఉన్నాయి. తొలుత ఫ్రాన్స్‌కు చెందిన క్లోజర్ పత్రిక తొలిసారి ఈ ఫొటోలను గత వారం ప్రచురించింది.

దీనిపై బ్రిటీష్ రాజ కుటుంబం తీవ్రంగా స్పందించింది. ప్రముఖుల ప్రైవేట్ జీవితాల్లోకి మీడియా తొంగి చూడటం ఎంతవరకు సబబు అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. దీనిపై కేట్, ప్రిన్స్ విలియం దంపతులు కోర్టుకు వెళ్లడం, క్లోజర్‌కు కోర్టు నోటీసులు ఇవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా క్లోజర్ కార్యాలయంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. దొంగచాటుగా కేట్‌ను ఫొటోల్లో బంధించిన ఫొటోగ్రాఫర్ కోసం గట్టిగా ఆరా తీశారు.

ఎవరి ప్రోద్బలంతో ఇదంతా జరిగిందనేది ఆధార సహితంగా గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్టు డిటెక్టివ్ వర్గాలు వెల్లడించాయి. టాప్ లెస్ ఫోటోలపై రాజకుటుంబం, కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఫోటోల ప్రచురణ మాత్రం ఆగడం లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Thursday's edition of Se og Hoer(See and hear) included a supplement that featured 14 pages of photos of the british royal couple on a recent vacation in a private chateau in the south of France.
Please Wait while comments are loading...