కాసు విగ్రహం ధ్వంసం: విమలక్కకు 14 రోజుల రిమాండ్

Vimalakka
హైదరాబాద్: నగరంలోని కెబిఆర్ పార్కు వద్ద గల మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసులో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నేత విమలక్కను సోమవారం ఉదయం పోలీసులు ఆమె నివాసంలో అరెస్టు చేశారు. విమలక్కతో పాటు మరో ఇద్దర్ని కూడా అరెస్టు చేసి వారిని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు విమలక్కకు 14 రోజుల రిమాండ్ విధించింది. వీరిపై పోలీసులు ఐపిసి 147, 148, 149, 332, 335, 425 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.

విమలక్కను పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆమె అరెస్టును నిరసిస్తూ పలువురు తెలంగాణవాదులు పోలీసులను అడ్డుకున్నారు. ఆమెను అరెస్టు చేస్తే ఊరుకునేది లేదన్నారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కట కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇందిరాపార్కు వద్ద తెలంగాణవాదులు విమలక్క అరెస్టును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

కాగా నాంపల్లి కోర్టు విమలక్కకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ఈ నెల 30వ తేది వరకు ప్రతి రోజు కోర్టులో సంతకం చేయాలని షరతు విధించింది.

కాగా సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం రోజున గుర్తు తెలియని దుండగులు హైదరాబాదులోని కెబిఆర్ పార్క్ వద్ద ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ఈ రోజు తెల్లవారు జామున ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా విగ్రహంపై టైర్లు వేసి నిప్పు పెట్టారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ధ్వంసమైన విగ్రహం కన్పించకుండా తెల్లని వస్త్రాన్ని చుట్టారు. సంఘటనా స్థలంలో తెలంగాణ జన ప్రతిఘటన పేరుతో కరపత్రాలు వదలి వెళ్లారు.

ఈ విగ్రహ ధ్వంసం తమ పనే అని ఆ తర్వాత తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ప్రకటించింది. తెలంగాణ ప్రాంతానికి ద్రోహం చేసిన కాసు బ్రహ్మానంద రెడ్డి, మర్రి చెన్నా రెడ్డి, జలగం వెంగళ రావుల విగ్రహాలను తాము తెలంగాణ గడ్డ పైన ఉండనిచ్చేది లేదనియుటిఎఫ్ నేతలు విమలక్క, దిలీప్ కుమార్ హెచ్చరించారు. సెప్టెంబర్ 30వ తేదిన జరగబోయే జీవ వైవిధ్య సదస్సును అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.

కెబిఆర్ పార్క్ వద్ద గల కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని అక్కడ నుండి తొలగించి, పార్క్ పేరును కూడా మార్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాంతంలోనే మరో నేత పేరు పెట్టాలని సూచించారు. తెలంగాణ బ్రతుకులను ఎద్దేవా చేసేలా ఈ గడ్డపై ఆంధ్రా నేతల విగ్రహాలు పెడుతున్నారని వారు మండిపడ్డారు. తెలంగాణ మార్చ్‌కు ముందు ట్యాంక్ బండ్ పైన విగ్రహాలు పెడితే కూల్చి వేస్తామని వారు హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+