వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ గురించి అంతా తెలుసు: విహెచ్‌తో సోనియా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
న్యూఢిల్లీ: తెలంగాణ గురించి తనకు అంతా తెలుసునని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ సమస్య తీవ్రతను కాంగ్రెసు తెలంగాణ ప్రాంత సీనియర్ నేత విహెచ్ ప్రస్తావించినప్పుడు ఆమె శుక్రవారంనాడు ఆ విధంగా అన్నారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని వి హనుమంతరావుకు ఆ పార్టీ అధినేత సోనియాగాంధీ సూచించారు.

శుక్రవారంనాడు సోనియాను ఆమె నివాసంలో విహెచ్ కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై చర్చించారు. అయితే తాజాగా కడుపునొప్పితో ఆస్పత్రిపాలై ఆపరేషన్ చేయించుకున్న విహెచ్ ఆరోగ్యం గురించి సోనియా ఆరా తీశారు.ప్రస్తుతం అంతా బాగానే ఉందని విహెచ్ చెప్పగా, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అని ఆమె సూచించారు.

తెలంగాణ సమస్య తీవ్రత పెరుగుతున్నందున త్వరగా పరిష్కరించాలని విహెచ్ ఆమెను కోరారు. తెలంగాణ గురించి తనకు అంతా తెలుసునని ఆమె సమాధానమిచ్చారు. రాష్ట్రంలో బీసీలను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం పార్టీ 100 అసెంబ్లీ సీట్లు ఇస్తానని ప్రకటించిందని, మైనార్టీలను ఆకట్టుకునేందుకు కూడా చర్యలు చేపట్టిందని విహెచ్ ఆమె దృష్టికి తీసుకెళ్లారు.

తక్షణం స్పందించి కాంగ్రెస్ బీసీల అభివృద్ధి కోసం చేపట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు విస్తృత స్థాయిలో చర్చ జరపాలని కోరారు. కాంగ్రెస్ పథకాలను ప్రచారం చేసే అంశంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. దీనిపై తప్పకుండా తాను తగిన చర్యలు తీసుకుంటానని సోనియా హామీ ఇచ్చినట్లు వీహెచ్ తెలిపారు.

English summary
AICC president Sonia Gandhi said to party Telangana region senior leadr that she knows every thing about Telangana. She suggested VH to take care of health.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X