గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విభజిస్తే ఏడారే, సెంటిమెంట్ అంటున్నారు: రాయపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Rayapati Sambasiva Rao
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, రాష్ట్ర విభజన జరిగితే ఆంధ్ర ఏడారిగా మారుతుందని గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు ఆదివారం అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో పెద్ద సంఖ్యలో సమైక్యాంధ్ర జెఏసి ఆధ్వర్యంలో సమైక్యవాదులు రోడ్డు పైకి వచ్చారు. ఈ సందర్భంగా రాయపాటి మాట్లాడారు. రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదన్నారు.

తెలంగాణలో కంటే సీమాంధ్రలోనే వెనుకబడిన ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని, తెలంగాణవాదులు మాటమార్చి సెంటిమెంట్ అంటున్నారని విమర్శించారు. తాము సమైక్యాంధ్ర కోసం పార్లమెంటులోనే మాట్లాడామన్నారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమని జెఏసి చైర్మన్ ఆచార్య శ్యామ్యూల్ అన్నారు. హైదరాబాదులో ఎటువంటి నష్టం జరిగినా మార్చ్‌కు అనుమతి ఇచ్చిన ప్రభుత్వమే బాద్యత వహించాల్సి ఉంటుందన్నారు.

తెలంగాణ కవాతు పేరుతో హైదరాదులో నిర్బంధం కొనసాగుతుందన్నారు. హైదరాబాదులో సీమాంధ్రులతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తులు ద్వంసం చేస్తుండటాన్ని ప్రపంచమంతా గమనిస్తుందన్నారు. శాంతి యుతంగా గవర్నర్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు బయల్దేరిన విద్యార్థులను సీమాంధ్ర జిల్లాల్లో పోలీసులు అరెస్ట్ చేయటం దుర్మార్గం అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్ససత్యనారాయణ చేసిన రెండు రాష్ట్రాల వ్యాఖ్యలు దురదష్టకరమన్నారు.

అదే జరిగితే సీమాంధ్రలో ఒక్కో జిల్లా ఒక్కో రాష్ట్రంగా ఏర్పాటుకు ఉద్యమాలు వస్తాయన్నారు. ఆయనకు అటువంటి ఆలోచన రావటమే దుర్మార్గం అన్నారు. తక్షణం ఆయన తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేదంటే విజయనగరంలో ఆయనను గృహనిర్భందం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున సమైక్యాంధ్రకు మద్దతుగా మానవ హారం నిర్వహించారు.

English summary
Guntur MP Rayapati Sambasiva Rao on Sunday said in Guntur that Seemandhra leaders and people are supporting United Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X