దెబ్బతీసేందుకు: కేజ్రీవాల్‌పై రాబర్ట్ వాద్రా ఎదురుదాడి

కేజ్రీవాల్ ఆరోపణలపై రెండు రోజులుగా వాద్రా ఏమీ మాట్లాడక పోవడం కాంగ్రెసుకు ముఖ్యంగా సోనియాకు తలనొప్పి తెచ్చి పెట్టింది. ఇప్పుడు వాద్రా ఎదురుదాడి చేయడం గమనార్హం. తన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎక్కడా చట్టాన్ని అతిక్రమించలేదని, ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నానని, తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, చట్టబద్దంగానే బిజినెస్ చేస్తున్నానని వివరణ ఇచ్చారు.
కేజ్రీవాల్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టారని, అందుకు మీడియాలో ప్రచారం కోసం తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై విమర్శలు చేయడం తగదన్నారు. మీ వద్ద తన వ్యాపారానికి వ్యతిరేకంగా ఏమైనా ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లవచ్చునని సూచించారు. అంతేకాని తన కుటుంబ ప్రతిష్ట దెబ్బతీయడం సరికాదన్నారు. కొత్తగా పార్టీ పెట్టినంత మాత్రాన విమర్శలు చేయాలా అని ప్రశ్నించారు.
కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్‌లు తనపై చేస్తున్న ఆరోపలలో ఏమాత్రం నిజం లేదన్నారు. ఇరవై ఒక్క ఏళ్లుగా వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్పారు. కాగా డిఎల్ఎఫ్ కూడా కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించింది. రాబర్ట్‌తో తమకు ఎలాంటి అక్రమ ఒప్పందాలు లేవని ప్రకటించింది.












Click it and Unblock the Notifications