రేపటిలోగాఒక్కటి చూపండి: పరకాలకు వినోద్ సవాల్

వైద్య కళాశాలల్లో సీట్ల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని, సీమాంధ్ర మూడు కళాశాలల్లో 50 చొప్పున సీట్లు పెంచి, తెలంగాణ కళాశాలల్లో సీట్లు పెంచకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా అని, అధికార యంత్రాంగం సవతి తల్లి ప్రేమ చూపడం కాదా అని అడిగారు. ఈ రోజు ఉత్పన్నమైంది కాబట్టి విడిపోవడానికి తాను ఈ ఒక్క కారణం చూపుతున్నానని ఆయన అన్నారు.
తెలంగాణ పది జిల్లాలకు కలిపి ఒకే ఒక్క నర్సింగ్ కాలేజీ హైదరాబాదులో ఉందని, సీమాంధ్రలో ఆరు నర్సింగ్ కాలేజీలు ఉన్నాయని, ఇది వివక్ష కాదా అని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ విడిపోవడానికి గల కారణాలను గత పదేళ్లలో చాలా చెప్పామని, ఒక్కో సబ్జెక్టు తీసుకుని తాము వేల కారణాలు చూపడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. సీమాంధ్ర ఒక్క రాష్ట్రంగా ఉండదగిందనేది పరకాల ప్రభాకర్‌కే కాకుండా మిగతా అందరికీ తెలుసునని ఆయన అన్నారు. సీమాంధ్ర చిన్న ప్రాంతం కాదని అన్నారు.
రాష్ట్రం విడిపోవడం వల్ల ఏ విధమైన నష్టం లేదని చెప్పాల్సిన బాధ్యత విద్యావంతుడైన పరకాల ప్రభాకర్‌కు ఉందని ఆయన గుర్తు చేశారు. సీమాంధ్రలో 25 పార్లమెంటు సీట్లుననాయని, గుజరాత్ రాష్ట్రంతో సమానంగా ఉన్నాయని, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి విడి రాష్ట్రంగా కొనసాగిందని ఆయన అన్నారు. ఆ తర్వాత తెలంగాణను కలుపుకుని ఈ ప్రాంత ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications