ప్రియురాలిపై దాడి చేసిన ప్రేమోన్మాది అరెస్ట్, ఏడేళ్లుగా..

Shanti
హైదరాబాద్: నగరంలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో ప్రియురాలు పైన, ఆమె తల్లిపై దాడి చేసిన ప్రేమోన్మాది కల్యాణ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. తాను శాంతి ఏడేళ్లుగా ప్రేమించుకున్నామని, తన కోపం శాంతి పైన కాదని, ఆమె తల్లి పైనే అని కల్యాణ్ తెలిపాడు. తమ పెళ్లికి శాంతి తల్లి ఇందిర అడ్డు పడుతున్నారని, ఆదివారం వారింటికి వెళ్లి ఆమె తల్లితో గొడవపడ్డానని, ఈ సమయంలో ఆమెపై దాడి చేశానని, శాంతి అడ్డు వస్తే ఆమెకు గాయాలయ్యాయని తెలిపాడు.

కాగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో దారుణం జరిగిన విషయం తెలిసిందే. ప్రేమించిన అమ్మాయి నో చెప్పడంతో ఉన్మాదిగా మారి యువతి పైన, ఆమె తల్లి పైన కత్తితో దాడి చేశాడు. నగరంలోని నాగోల్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఉంటున్న కల్యాణ్ అనే యువకుడు కొన్నేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను ఎంతకూ అంగీకరించక పోవడంతో కల్యాణ్ ఉన్మాదిగా మారిపోయాడు.

ఉదయం ఓ కత్తి తీసుకొని సాయి నగర్‌లో ఉంటున్న అమ్మాయి ఇంటికి వెళ్లాడు. ఇంట్లోకి వెళ్లి ఆమె పైన, ఆమె తల్లి పైన కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని పట్టుకునే ప్రయత్నం చేశారు. అతను మాత్రం వారి నుండి తప్పించుకొని పరారయ్యాడు. ఈ యువతి, కల్యాణ్ గతంలో ఓ జ్యూవెల్లరీ దుకాణంలో కలిసి పని చేశారు. అప్పటి నుండే అతను ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు.

అయితే. వారిద్దరూ ఓ నగల దుకాణంలో పని చేసినప్పుడు పరిచయం కాస్త ప్రేమగా మారిందని, కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదని, కల్యాణ్ వ్యవహార శైలి నచ్చక పోవడంతో శాంతి దూరం జరిగిందని, ఈ సమయంలోనే కల్యాణ్ వారిపై దాడి చేశారని కూడా చెబుతున్నారు. కాగా గాయాల పాలైన తల్లీ కూతుళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+