తుపాకీతో కాల్చుకొని ఆశా భోంస్లే కూతురు ఆత్మహత్య

Asha Bhosle-Varsha Bhosle
ముంబై: ప్రముఖ గాయని ఆశా భోంస్లే కూతురు వర్షా భోంస్లే సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. వర్షా భోంస్లే వయస్సు యాభయ్యేళ్లు. ఆమె ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ఈ రోజు తన సర్వీస్ రివాల్వర్‌తో వర్షా భోంస్లే ఆత్మహత్య చేసుకున్నారు. వర్షా నాలుగేళ్ల క్రితం 2008లో కూడా ఓసారి ఆత్మహత్యా ప్రయత్నాలు చేశారు.

వర్షా భోంస్లే ఆశా భోంస్లే రెండవ కూతురు. ఆరోగ్య సమస్యలతో ఆమె ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. వర్షా భోంస్లే పలు ప్రముఖ దిన పత్రికలకు కాలమిస్టుగా పని చేశారు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే కాకుండా తల్లితో కలిసి పలు సంగీత కార్యక్రమాలలో వర్షా పాల్గొన్నారు.

టివి ఛానల్ రిపోర్ట్స్ ప్రకారం వర్షా భోంస్లే సోమవారం ముంబయిలో తను నివసిస్తున్న ప్రభు కుంజ్ నివాసంలో కాల్చుకుంది. హిందీ, మరాఠీ చిత్రాలలో ప్లేబ్యాక్ సింగర్‌గా పని చేశారు. వర్ష ఆత్మహత్యను పోలీసులు కూడా నిర్ధారించారు. వర్ష తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+