కేజ్రీవాల్ ఎవరు?: యుపి సిఎం అఖిలేష్ యాదవ్ ప్రశ్న

Akhilesh Yadav -Aravind
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోమవారం అరవింద్ కేజ్రీవాల్ ఎవరు అని అడిగారు. ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ కార్యకర్తగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ నిన్నటి వరకు ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే బృంద సభ్యుడు. కేజ్రీవాల్ రాజకీయాల్లోని అవినీతిని రూపుమాపేందుకు కొత్త పార్టీని కూడా స్థాపిస్తున్నట్లు ప్రకటించారు. అన్నా హజారే బృందం సభ్యుడిగా, అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తున్న కార్యకర్తగా అరవింద్ దాదాపు అందరికీ తెలుసు.

మూడు రోజుల క్రితం ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా పైన అవినీతి ఆరోపణలు కూడా చేసి సంచలనం సృష్టించారు. అలాంటి అరవింద్ కేజ్రీవాల్ గురించి అడిగినప్పుడు ఆయన ఎవరని యుపి ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రశ్నించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. యుపి రాజధాని లక్నోలోని ఓ కార్యక్రమంలో అఖిలేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబర్ట్ వాద్రా, కేజ్రీవాల్ ఇష్యూపై అడిగారు.

దానికి అఖిలేష్ స్పందిస్తూ.... కేజ్రీవాల్ ఎవరు(కేజ్రీవాల్ కౌన్ హై) అని అడిగారు. అఖిలేష్‌కు కేజ్రీవాల్ గురించి తెలియక అలా అనలేదని, ఆ ఇష్యూలో జోక్యం చేసుకోవద్దన్న ఉద్దేశ్యంతోనే అలా ఎదురు ప్రశ్నించారని అంటున్నారు. సమాజ్ వాది పార్టీ యూపిఏ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతిస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ అల్లుడిపై కామెంట్ చేయక పోవడమే ఉత్తమమని, అంతేకాకుండా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారికి కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉంటేనే మంచిదని భావించి అలా మాట్లాడి ఉంటారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+