• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

డబ్బు మతం పేరుతో: జగన్‌పై బాబు, చమన్ ప్రార్థనలు

By Srinivas
|

Chandrababu Naidu
అనంతపురం: డబ్బు, కులం, మతం పేరుతో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇతర పార్టీల నేతలను ప్రలోభ పెడుతోందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం విమర్శించారు. అనంతపురం జిల్లాలో బాబు పాదయాత్ర 13వ రోజు గుంతకల్లు పట్టణంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డిని తాను ఎంతగానో ప్రోత్సహించానని, అయినప్పటికీ ఆయన నమ్మకద్రోహం చేశారని విమర్శించారు.

యువకుడైనా ప్రవీణ్ రెడ్డి ప్రలోభాలకు లొంగిపోవడం బాధాకరమన్నారు. ఎంతో ప్రోత్సహిస్తే ఇలా టిడిపిని మోసం చేయడం సరికాదన్నారు. అనంత జిల్లాలో పాదయాత్ర విజయవంతమైందన్నారు. ఇదే ఉత్సాహాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని సూచించారు. విభేదాలు పక్కన పెట్టి పార్టీ కోసం అందరూ పని చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని పార్టీ సమస్యలను సరిదిద్దాల్సిన బాధ్యతను బాబు బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి నెత్తిన పెట్టారు.

కార్యకర్తల మద్దతే పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు. పార్టీలో ఒకరిద్దరు నాయకులు తప్పుడు పనులు చేసినా కార్యకర్తలు మాత్రం ఎప్పుడూ పార్టీని వీడలేదన్నారు. తాను కుప్పం నియోజకవర్గంతో సమానంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి తంబళ్లపల్లెను అభివృద్ధి చేస్తానని బాబు తనను కలిసేందుకు వచ్చిన ఆ నియోజకవర్గం టిడిపి నేతలకు హామీ ఇచ్చారు. కాగా అనంతపురంలో బాబు యాత్ర ఈ రోజుతో ముగుస్తుంది.

తనవంతుగా బాబు.. గరికపాటి

రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, అందుకే చంద్రబాబు తన వంతుగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టారని గరికపాటి మోహన్ రావు అన్నారు. ప్రజలు ఎన్నో కష్టాల్లో ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని సూచించారు. తమకు రుణమాఫీ చేయాలని రైతులు చంద్రబాబును కోరుతున్నారని, దీనిపై ఆయన ఆలోచిస్తున్నారని మోహన్ రావు వివరించారు. బాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

ఒకే గూటి పక్షులు

కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు ఒకే గూటి పక్షులని పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. చంద్రబాబు పాదయాత్రతో ఆ పార్టీల వెన్నులో వణుకు పుడుతోందన్నారు. అక్రమ భూకేటాయింపుల కేసులో మంత్రి రఘువీరా రెడ్డి జైలుకు వెళ్లక తప్పదన్నారు. అనంతలో బాబు పాదయాత్ర విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు అని ఆ పార్టీ ఎంపి సిఎం రమేష్ అన్నారు.

చమన్ ప్రార్థనలు

చంద్రబాబు నాయుడు పాదయాత్ర విజయవంతం కావాలని దివంగత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ప్రధాన అనుచరుడు చమన్ గుంతకల్లులో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

English summary
Telugudesam party chief Nara Chandrababu Naidu alleged that YSR Congress party chief YS Jaganmohan Reddy is attracting other party leaders with money, caste and religion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X