కేబినెట్లోకి రాహుల్ గాంధీ: జోరుగా ఊహాగానాలు

మరోవైపు రాహుల్‌ను కేబినెట్లోకి తీసుకోవడం కంటే పార్టీలోనే పదవి ఇవ్వడం సముచితమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్లోకి తీసుకుందామనుకున్నప్పటికీ రాహుల్ సుముఖంగా లేరని తెలుస్తోంది. ఇటీవల ఆయన తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తించేందుకు సిద్ధమన్నారు. అలా చెప్పినప్పటికీ కేబినెట్ పదవికి ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు.
దీంతో అతనికి పార్టీలో ఏదైనా మరో ముఖ్య పదవి ఇచ్చి పార్టీ బలోపేతం బాధ్యతలు అప్పగిస్తే మంచిదని చెబుతున్నారని సమాచారం. అయితే ఇంకొందరు మాత్రం 2014లో పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీయే కాబట్టి పాలనాపరమైన అనుభవం కోసం మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలోకి రావడమే మంచిదని చెబుతున్నారని అంటున్నారు.
కిరణ్ బిజీ బిజీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన కాంగ్రెసు పార్టీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. గులాం నబీ ఆజాద్, సుశీల్ కుమార్ షిండే, రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు. సాయంత్రం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. కేంద్రంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీని ప్రస్తుతానికి పక్కకు పెట్టమని అధిష్టానం కిరణ్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications