హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ చెప్పలేదా?: షర్మిలకు రేవంత్, కన్నీటిని కూడా..

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy - Sharmila
హైదరాబాద్: ప్రభుత్వాన్ని పడగొట్టబోమని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పలేదా అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి గురువారం మరో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించిన జగన్ సోదరి షర్మిలను ప్రశ్నించారు. గతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలే కాంగ్రెసుకు అనుకూలంగా ఓటు వేశారని ఆరోపించారు.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కారణంగానే నాదెండ్ల మనోహర్ స్పీకర్‌గా ఎన్నికయ్యారన్నారు. షర్మిల పాదయాత్రను చూస్తుంటే వంద ఎలుకలు తిన్న పిల్లి చేసే యాత్రలా కనిపిస్తోందని మండిపడ్డారు. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కన్నీటిని కూడా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కన్నీటితో ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. కుమ్మక్కు అనే పదానికి అర్థం ఏమిటో చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు.

2014 వరకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని జగన్ గతంలో చెప్పారని వాటిని బట్టి కుమ్మక్కు ఎవరయ్యారో అర్థమవుతుందన్నరు. కేంద్రంలో యూపిఏ ప్రభుత్వంతో ఫిక్సింగ్ చేసుకొని ఆ ప్రభుత్వాన్ని కూడా కొనసాగిస్తున్న ఘనత జగన్‌ది అన్నారు. అవినీతి, ధరల పెరుగుదల తదితర అంశాలపై జగన్ పార్టీ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. గతంలో తాము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ప్రభుత్వాన్ని కూలగొడతామన్న వారు ఎందుకు సరిపడా సభ్యులను తీసుకు రాలేదో చెప్పాలన్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో యూపిఏ అభ్యర్థికి ఓటు వేయడం, అవిశ్వాసంలో ఎమ్మెల్యేలను తీసుకు రాకపోవడంలాంటి వాటిని పరిశీలిస్తే కాంగ్రెసుతో జగన్ పార్టీ కుమ్మక్కైనట్లుగా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజల సానుభూతి కోసమే షర్మిల పాదయాత్ర చేస్తున్నారని పార్టీ మహిళా నేత శోభా హైమావతి అన్నారు. చంద్రబాబు ప్రజలల సమస్యలు తెలుసుకునేందుకు యాత్ర చేస్తే షర్మిల జగన్ సమస్యను ప్రజలకు చెప్పేందుకు పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

English summary

 TDP spokes person Revanth Reddy has questioned YSR Congress party leader Sharmila Reddy about her party chief YS Jaganmohan Reddy's statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X