వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు దగ్గరగా.. దూరంగా: పార్టీ చీఫ్‌కు కొత్త హెడ్డేక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పార్టీ పరంగా ఇబ్బందులు ప్రారంభమయ్యాయి! సాధారణంగా ఏ పార్టీలోనైనా ఇలాంటివి మామూలే అయినప్పటికీ సాధారణ ఎన్నికలకు మరో సంవత్సరానికి పైగా మాత్రమే ఉన్న సమయంలో కొత్తగా ఏర్పడిన పార్టీలో అదీ సెంటిమెంట్ పైనే ఇప్పటి వరకు నెట్టుకొచ్చిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ముఖ్య నేతలు దగ్గర వస్తూ దూరంగా జరుగుతున్నట్లుగా కనిపిస్తోంది.

అసంతృప్తితోనే సాగుతున్నారు

మైసూరా రెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్ జైలుకు వెళ్లిన సమయంలో హడావుడిగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలిశారు. దీంతో అతనిపై టిడిపి వేటు వేసింది. జగన్ జైలుకు వెళ్లడంతో మైసూరానే పార్టీలో కీలకంగా మారనున్నారనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది. టిడిపిలో ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెసులో ఉన్నప్పుడు మైసూరా వెలుగు వెలిగారు. కానీ జగన్ పార్టీలోకి వెళ్లాక మైసూరా ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. షర్మిల పాదయాత్ర సమయంలో కనిపించినప్పటికీ ఆయన అసంతృప్తితోనే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టిడిపి మరోసారి ఎంపీగా అవకాశం ఇవ్వకుంటే మైసూరా బిజినెస్ చూసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్ పార్టీలో ఇమడలేని పక్షంలో ఆయన తన వ్యాపారంపై దృష్టి సారిస్తారని చెబుతున్నారు.

గుంటూరు జిల్లాకు చెందిన ముఖ్య రాజకీయ నాయకుడు మాకినేని పెదరత్తయ్య కూడా టిడిపి నుండి జగన్ పార్టీలో చేరారు. కానీ ఆయన కూడా ఎక్కువ కాలం పార్టీలో కొనసాగలేకపోయారు. ఆయనను బుజ్జగించేందుకు నేతలు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు. జగన్ ఓదార్పు యాత్ర చేస్తున్న సమయంలోనే మాకినేని వర్గానికి మరో వర్గానికి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి. ఆయన తిరిగి టిడిపిలో చేరతారనే ప్రచారం ఆ మధ్య జరిగింది. కానీ ఇంకా ప్రకటించలేదు. కానీ ఆయన మాత్రం జగన్ పార్టీకి దూరమైనట్లే అందరూ భావిస్తున్నారు.

జగన్ వైఖరి.. బెర్త్ సమస్య

జగన్ వైఖరి.. బెర్త్ సమస్య

వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి బయటకు వెళ్లిన వారు లేదా అసంతృప్తిగా ఉన్న వారు జగన్ వైఖరితో పాటు వచ్చే ఎన్నికల నాటికి బెర్త్ కారణంగా దూరమవుతున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీ ప్రారంభించిన కొత్తలో హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవిత జగన్ పార్టీలో చేరి ఆ తర్వాత వెనక్కి తగ్గారు. శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి, గుంటూరు జిల్లా సీనియర్ నేత మాకినేని పెదరత్తయ్యలు పార్టీకి ఇప్పటికే దూరమయ్యారు.

ఇక మాజీ రాజ్యసభ సభ్యుడు మైసూరా రెడ్డి పార్టీలో కీరోల్‌గా వ్యవహరిస్తారనుకుంటే ఇటీవల ఆయన కూడా అసంతృప్తుల జాబితాలో చేరినట్లుగా తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిని బాగా ఆరాదించే మాజీ మంత్రి, వరంగల్ జిల్లా ముఖ్యనేత కొండా సురేఖలు కూడా కొన్నాళ్లు అసంతృప్తుల జాబితాలో చేరారు. ఆ తర్వాత చల్లబడి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ కొత్తగా ఏర్పడి, సెంటిమెంట్ పైన ఆధారపడి, కష్టాల్లో ఉన్న పార్టీలో సాధారణ ఎన్నికలకు ముందు ఇబ్బందులు రావడం ఆ పార్టీ క్యాడర్‌లో ఆందోళన కలిగిస్తోందట.

అలా వచ్చి ఇలా వెళ్లిన రాజశేఖర్, జీవిత

అలా వచ్చి ఇలా వెళ్లిన రాజశేఖర్, జీవిత


హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవితలకు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డితో మంచి అనుబంధం ఉంది. అదే అనుబంధంతో వారు కాంగ్రెసును వీడి జగన్ పార్టీకి మద్దతు పలికారు. ఆయన చేసిన పలు దీక్షల్లో పాల్గొన్నారు. అయితే జగన్ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని భావించి వారిద్దరూ ఆ పార్టీకి వెంటనే దూరమయ్యారు. తాము కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతున్నామని, జగన్ పార్టీలో ఇప్పటి వరకు చేరలేదని స్టేట్‌మెంట్ ఇచ్చారు. జగన్ వైఖరి పైన వారు విమర్శలు గుప్పించారు.

కొండా సురేఖతో పడక పుల్లా పద్మావతి!

కొండా సురేఖతో పడక పుల్లా పద్మావతి!

శాసనమండలి సభ్యురాలు పుల్లా పద్మావతి చాలా రోజులు జగన్ పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన చేపట్టిన పలు దీక్షల్లో పాల్గొన్నారు. ఓదార్పులో కనిపించారు. కానీ సొంత జిల్లాకు చెందిన కొండా సురేఖతో విభేదాలతో పాటు మరికొన్ని కారణాలతో ఆమె జగన్‌కు దూరమైనట్లుగా వార్తలు వచ్చాయి. తొలి నుండి జగన్‌కు మంచి మద్దతురాలిగా ఉన్న పుల్లా పద్మావతి ఒక్కసారిగా కొద్ది నెలల క్రితం ప్లేటు ఫిరాయించారు.

అసంతృప్తితోనే సాగుతున్నారు

అసంతృప్తితోనే సాగుతున్నారు

మైసూరా రెడ్డి పార్టీ అధ్యక్షుడు జగన్ జైలుకు వెళ్లిన సమయంలో హడావుడిగా వెళ్లి ఆ కుటుంబాన్ని కలిశారు. దీంతో అతనిపై టిడిపి వేటు వేసింది. జగన్ జైలుకు వెళ్లడంతో మైసూరానే పార్టీలో కీలకంగా మారనున్నారనే అభిప్రాయం అందరిలోనూ కలిగింది. టిడిపిలో ఉన్నప్పుడు, అంతకుముందు కాంగ్రెసులో ఉన్నప్పుడు మైసూరా వెలుగు వెలిగారు. కానీ జగన్ పార్టీలోకి వెళ్లాక మైసూరా ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు. షర్మిల పాదయాత్ర సమయంలో కనిపించినప్పటికీ ఆయన అసంతృప్తితోనే ఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. టిడిపి మరోసారి ఎంపీగా అవకాశం ఇవ్వకుంటే మైసూరా బిజినెస్ చూసుకుంటారనే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు జగన్ పార్టీలో ఇమడలేని పక్షంలో ఆయన తన వ్యాపారంపై దృష్టి సారిస్తారని చెబుతున్నారు.

బెర్తుల కోసం పోటా పోటీ

2014 సాధారణ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వస్తుందని చాలామంది నేతలు గట్టిగా విశ్వషిస్తున్నారు. అందుకే టిడిపి, కాంగ్రెసు పార్టీల ప్రజాప్రతినిధులు జగన్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇదే జగన్ పార్టీని ఇబ్బందులకు గురి చేస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గాలలో పార్టీ పరంగా పలువురు టిక్కెట్ పైన ఆశలు పెట్టుకొని పాగా వేశారు. కానీ కొత్తగా ప్రజాప్రతినిధులు వస్తుండటంతో ఇప్పటికే ఉన్న వారు తమ భవిష్యత్తుపై గందరగోళంలో పడ్డారు.

దీంతో వారు ప్రత్యామ్నాయాల వైపు దృష్టి సారిస్తున్నారట. తాజా పరిణామాలు తీసుకుంటే చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి, పలమనేరు టిడిపి ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలు జగన్ పార్టీ వైపు వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఇప్పటికే 2014 ఎన్నికల టిక్కెట్ కోసం మకాం వేసిన నేతలలో ఆందోళన కలుగుతోందట. ఏం చేయాలో తెలియని స్థితిలో వారు ఉన్నారట. టిక్కెట్ల కోసం పోటా పోటీ ఇలాగే ఉంటే ఇదే తమను దెబ్బతీస్తుందని పార్టీ క్యాడర్ ఆందోళన పడుతోందట.

English summary
It is said that YSR Congress party chief YS Jaganmohan Reddy is facing problems from party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X