పవన్ కల్యాణ్ సినిమాకు తెలంగాణ సెగ: ఫ్లెక్సీ ధ్వంసం

ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా, సినిమాకు, పవన్ కల్యాణ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ థియేటర్ ఎదుట ఆందోళనకు దిగారు. తెలంగాణ ప్రాంతంలో కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా రాజకీయ రంగు పులుముకన్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సినిమాపై నిప్పులు చెరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో పవన్ కళ్యాణ్ సినిమాపై పార్టీ కార్యకర్తలు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు.
పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను, కెమెరామేన్ గంగతో రాంబాబు పోస్టర్లను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చించేసి, వాటిని దగ్ధం చేశారు. తమ నాయకుడు చంద్రబాబు పాదయాత్రపై సినిమాలో సెటైర్లు ఉన్నాయని, ఉద్దేశ్యపూర్వకంగానే అందులో ఆ సంభాషణలు పెట్టారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాలోని పాత్రల పేర్లు కూడా చంద్రబాబు కుటుంబ సభ్యుల పేర్లను పోలి ఉన్నాయని వారన్నారు. సినిమాలోని సెటైర్లను తొలగించకపోతే కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమాను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
పాత్రల పేర్లు జవహర్ నాయుడు, రానా బాబు వంటివి ఉండడం పట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన కెమెరామేన్ గంగతో రాంబాబు సినిమా గురువారం విడుదలైన విషయం తెలిసిందే. సినిమాలో సెటైర్లు దండిగా ఉన్నాయి. రాజకీయాలపైనే ఈ సెటైర్లను గురి పెట్టినట్లు అర్థమవుతోంది.
-
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ???












Click it and Unblock the Notifications