తెలంగాణలో తండ్రితో లోకేష్: బాబు నెత్తిన బతుకమ్మ

వందలాదిమంది మహిళలు బతుకమ్మలతో చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చంద్రబాబు బతుకమ్మ నెత్తిన పెట్టుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి నేతలు మాట్లాడుతూ... చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చూస్తే తమ పార్టీ కార్యకర్తలే బుద్ధి చెబుతారన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదన్నారు. చంద్రబాబు 2008లోనే తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారని, మరోసారి ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు.
అలాంటి చంద్రబాబు పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. అదిగో తెలంగాణ వస్తుంది.. ఇదిగో తెలంగాణ వస్తుందని మాట్లాడుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును కోదండరామ్ ఎందుకు ప్రశ్నించరని అన్నారు. చంద్రబాబు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వస్తున్నారని, పాదయాత్రను అడ్డుకుంటే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారన్నారు.
కాగా అంతకుముందు కర్నూలు జిల్లాలో చంద్రబాబు మాట్లాడారు. టిడిపి అధికారంలోకి వస్తే రుణ మాఫీపై తొలి సంతకం పెడతానని, బెల్టు షాపుల తొలగింపుపై రెండో సంతకం చేస్తానని చెప్పారు. కిరణ్ ప్రభుత్వాన్ని ఉతికి ఆరేయాలనిపిస్తోందన్నారు. తన పాలనపై కాంగ్రెసు వాళ్లు విమర్శలు చేస్తుంటే.. దేశ విదేశాల్లో అనుసరిస్తున్నారన్నారు. చంద్రబాబు రాకతో సుంకేశుల డ్యామ్ జన సంద్రమైంది. రాజోలు మొత్తం పసుపుమయమైంది. చంద్రబాబు తనయుడు లోకేష్ తండ్రితోనే ఉన్నారు.












Click it and Unblock the Notifications