చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లింది: గట్టు వ్యాఖ్య

తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, తెలుగుదేశం పార్టీ మునిగిపోతున్న పడవ అని ఆయన అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైల్లో సెల్ ఫోన్ వాడుతున్నట్లు తెలుగుదేశం నాయకులు చేసిన ఆరోపణలను ఆయన తప్పు పట్టారు. దానికి రుజువులు చూపాలని ఆయన డిమాండ్ చేశారు. యనమల సహా తెలుగుదేశం నాయకులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.
షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. సినిమా డైరెక్షన్‌లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పాదయాత్ర ఓ నాటకమని, కాంగ్రెసుతో కుమ్మక్కు కావడం వల్లనే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం లేదని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేసినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు. కుమ్మక్కు రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications