పెళ్లికి గీతిక ఒత్తిడి, కందా నిరాకరణ: అరుణ చద్దా

అటువంటి సంబంధాన్ని కొనసాగించడానికి గీతికా శర్మ ఇష్టపడలేదని, తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చిందని చెప్పింది. తన సూసైడ్ నోట్‌లో గీతికా శర్మ తన మృతికి కందాతో పాటు అరుణ చద్దా కారణమని రాసిన విషయం తెలిసిందే. ఏదో సాకు చెబుతూ గోపాల్ కందా పెళ్లికి నిరాకరిస్తూ వచ్చాడని అరుణ చద్దా చెప్పింది.
గోవాకు చెందిన అంకితతో గోపాల్ కందా సంబంధాన్ని కూడా గీతికా శర్మ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిందని తెలిపింది. ఇప్పటికిప్పుడు పెళ్లికి ఒత్తిడి తేవద్దని కందా కోరికతో తాను గీతికకు నచ్చజెప్పే ప్రయత్నం చేసేదాణ్ననని ఆమె చెప్పింది. అరుణ చద్దా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఓ ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. తనను పెళ్లి చేసుకోవడానికి కందా నిరాకరిస్తుండడంతో గీతికకు చాలా కోపం వచ్చిందని, దాంతో ఆమె ఎండిఎల్ఆర్ కార్యాలయానికి వెళ్లడానికి ఇష్టపడలేదని చెప్పింది.
గీతికపై ఒత్తిడి పెట్టడానికి కందా ఎంబిఎ చదవడానికి తాను ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చాడని అరుణ చద్దా చెప్పింది. ఎంబిఎ కోర్సుకు ఎండిఎల్ఆర్ ఇచ్చిన స్పాన్సర్‌షిప్‌ను తిరిగి ఇచ్చేయాలని, పాఠశాలలు నడపడానికి ఏర్పాటైన విద్యా సంస్థ అధ్యక్షపదవికి రాజీనామా చేయాలని గీతికపై ఒత్తిడి తెచ్చారని, అందుకు గీతిక ఇష్టపడలేదని ఆమె వివరించింది. పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడంతో కందాను కలుసుకోవడానికి గీతిక నిరాకరిస్తూ వచ్చిందని అరుణ చద్దా చెప్పింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications