హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రిని వదిలేసిన పోలీసులు!: సునీల్ కారుకు ఫైన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Basawaraj Saraiah
హైదరాబాద్: భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైదరాబాదులోని పలు కూడళ్లలో కార్లలో బ్లాక్ ఫిల్స్‌పై కొరడా ఝులిపిస్తున్న ట్రాఫిక్ పోలీసులు బిసి సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య కారును మాత్రం విడిచిపెట్టినట్లుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. కార్లకు బ్లాక్ ఫిలిం, ఇతరత్రా స్టిక్కర్లు, బొమ్మలు ఉంటే వాటిని ట్రాఫిక్ పోలీసులు తొలగింప చేస్తున్నారు. ఇందులో భాగంగా పలు కూడళ్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

అసెంబ్లీ పరిసరాల్లో కంట్రోల్ రూం దగ్గర మంత్రి బస్వరాజు సారయ్య కారును ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలింతో గుర్తించారు. దానిని ఆపారు. అయితే అందులో మంత్రి ఉన్నాడని తెలియడంతో విడిచిపెట్టినట్లుగా విమర్శలు వస్తున్నాయి. ట్రాఫిక్ ఇన్సుపెక్టర్ కారును ఆపారట. మంత్రి సెక్యూరిటీ వచ్చి చెప్పడంతో పోలీసులు వదిలేశారని అంటున్నారు. అయితే పోలీసులు మాత్రం మంత్రిని కూడా వదలమని చెబుతున్నారు.

ఈ రోజులోగా బ్లాక్ ఫిలిం తీసివేయించుకోవాలని అందరికి చెప్పామని, అందరిలాగే మంత్రి సారయ్య వాహనానికి కూడా రూ.100 ఫైన్ వేస్తామని చెప్పారు. కాగా అంతకుముందే హీరో కమ్ కమెడియన్ సునీల్ కారుకు ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ ఫిలిం ఉన్నందుకు రూ.100 ఫైన్ వేసిన విషయం తెలిసిందే.

సునీల్ తల్లి కారులో వెళుతుండగా ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. బ్లాక్ ఫిలిం తొలగించలేదని ఫైన్ వేశారు. కాగా పంజాగుట్ట చౌరస్తా, కంట్రోల్ రూం, ఖైరతాబాద్ చౌరస్తా, చెక్ పోస్టు తదితర ప్రాంతాలలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి బ్లాక్ ఫిలిం ఉన్న కార్లకు ఫైన్ వేస్తున్నారు.

English summary
Hero and comedian Sunil Car fined with Rs.100 by Hyderabad Traffic police on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X