హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ జంప్ జిలానీలు: గేమ్ స్టార్ట్ చేసిన జగన్, కెసిఆర్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మళ్లీ ఆట ప్రారంభించారు! సీమాంధ్రలో జగన్ పార్టీలోకి, తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీలోకి అడపాదడపా ఇటీవలి వరకు జంప్‌లు కనిపించినా కొద్ది రోజులుగా ఇది మళ్లీ ఊపందుకున్నట్లుగా కనిపిస్తోంది. అయితే నిన్నటి వరకు లోపాయకారిగా మద్దతు ఇచ్చుకుంటారనే ఆరోపణలు ఎదుర్కొన్న జగన్, కెసిఆర్ తెలంగాణలో నువ్వా-నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు.

సీమాంధ్రలో తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలను టార్గెట్‌గా పెట్టుకున్న జగన్ తెలంగాణలో ఆ పార్టీల నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి అసంతృప్త నేతలకు కూడా గాలం వేస్తుండటం గమనార్హం. జగన్ జైలుకు వెళ్లిన తర్వాత కొంతకాలం ఆ పార్టీలోకి జంప్‌లు తగ్గాయి. జగన్‌ను సిబిఐ విచారిస్తున్న సమయంలో ఆయనను కలిసిన ఆళ్ల నాని, సుజయ కృష్ణ రంగారావులు ఆ తర్వాత ఆ పార్టీలోకి వెళతామని చెప్పి ఒక్కసారిగా మరోసారి వేడి రగిలించారు.

జంపింగ్స్: గేమ్ స్టార్ట్ చేసిన జగన్, కెసిఆర్!

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలు నుండే చక్రం తిప్పుతున్నారు! ఆయన జైలులో ఉన్నప్పటికీ పలువురు ప్రజా ప్రతినిధులు ఆయన పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు ఆయన తెలంగాణలో పట్టు పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై అసంతృప్తితో ఉన్న వారి పైన అసంతృప్తితో ఉన్న వారికి గాలం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

జంపింగ్స్: గేమ్ స్టార్ట్ చేసిన జగన్, కెసిఆర్!

పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ జిల్లాకు చెందిన సుజయ కృష్ణ రంగారావు, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని జగన్ జైలుకు వెళ్లిన తర్వాత ఓసారి రాష్ట్రంలో వేడిని రగిలించారు.

జంపింగ్స్: గేమ్ స్టార్ట్ చేసిన జగన్, కెసిఆర్!

తెలంగాణపై దృష్టి సారించిన జగన్.. కెసిఆర్ పట్ల అసంతృప్తితో ఉన్న వారితో పాటు ఈ ప్రాంతంలోని ఆయా జిల్లాల్లోని టిడిపి, కాంగ్రెసు నేతల్లో తమ వైపుకు వీజిగా ఎవరు వస్తారో చూసుకుంటున్నారట. ఈ కోవలోనే నల్గొండ జిల్లా టిడిపి నేత సంకినేని వెంకటేశ్వర రావు టిడిపిపై అసంతృప్తి పేరుతో జగన్ పార్టీలోకి వెళుతున్నారని అంటున్నారు.

జంపింగ్స్: గేమ్ స్టార్ట్ చేసిన జగన్, కెసిఆర్!

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి ఆపరేషన్ ఆకర్ష చేపట్టారు. టిడిపి నుండి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిని ఆయన తమ పార్టీలోకి ఆహ్వానించారు. హరీశ్వర్ వచ్చే నెలలో తెరాస జెండా పట్టుకోనున్నారట.

జంపింగ్స్: గేమ్ స్టార్ట్ చేసిన జగన్, కెసిఆర్!

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ జిల్లాల్లో వస్తున్నా మీకోసం పేరుతో ఉత్సాహంగా పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆయన ఆత్మస్థైర్యం దెబ్బతీసి, టిడిపి క్యాడర్‌లో ఆందోళన కలిగించేందుకే కెసిఆర్ మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారని అంటున్నారు.

ఆ తర్వాత సిబిఐ దర్యాఫ్తు, ఈడి అటాక్‌ల నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ భవిష్యత్తు ఏమవుతుందోనని ఆందోళన వ్యక్తం కావడంతో మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రవీణ్ కుమార్ రెడ్డి(తంబళ్లపల్లి), అమర్నాథ్ రెడ్డి(పలమనేరు), కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్దాల రాజేష్(చింతలపూడి)లు జగన్‌కు జైకొడతామని చెప్పి రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించారు.

వీరే కాకుండా రెండు పార్టీల నుండి పలువురు ప్రజాప్రతినిధులు జగన్‌కు జై కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ప్రజాప్రతినిధులే కాదు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలోనే సాధారణ ఎన్నికలకు ముందు జగన్‌కు జై కొట్టే వారున్నారని చెబుతున్నారు. ఇక తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లాలో టిడిపి ముఖ్య నేత సంకినేని వెంకటేశ్వర రావు జగన్ వైపుకు వెళ్తున్నారు. ఆయన వచ్చే నెలలో విజయమ్మ సమక్షంలో జగన్ పార్టీలో చేరనున్నారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెసు సీనియర్ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కూడా జగన్ వైపు వెళ్లారు.

కెసిఆర్ పట్ల అసంతృప్తితో ఉన్న వారికి జగన్ పార్టీ గాలం

తెలంగాణ ప్రాంతంలో జగన్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పట్ల అసంతృప్తితో ఉన్న నేతలకు గాలం వేస్తున్నారని అంటున్నారు. తొలి నుండి కెసిఆర్‌కు మంచి మద్దతుదారుడుగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇప్పటికే జగన్ పార్టీలో చేరారు. 2009 సాధారణ ఎన్నికల్లో తనకు సిరిసిల్ల టిక్కెట్ ఇవ్వకుండా తన తనయుడు కెటిఆర్‌కు ఇవ్వడంతో స్థానిక నేత కెకె మహేందర్ రెడ్డి కెసిఆర్ పైన గుర్రుగా ఉన్నారు.

అవకాశం కోసం ఎదురు చూసిన కెకె జగన్ పార్టీ పెట్టడంతో ఆ పార్టీతో చేరిపోయారు. అంతేకాదు.. సిరిసిల్లలో తన సత్తా చాటేందుకు జగన్ జైలుకు వెళ్లినప్పటికీ ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో చేనేత దీక్ష నిర్వహింప చేసి కెసిఆర్‌కు కెటిఆర్ నియోజకవర్గంలో సవాల్ విసిరారు. అప్పుడే బోటాబోటీ మెజార్టీతో గెలిచిన కెటిఆర్ భవిష్యత్తు కెకె సవాల్‌తో సిరిసిల్లలో ప్రశ్నార్థకంగా మారింది.

నల్గొండ జిల్లాలో జిట్టా బాలకృష్ణా రెడ్డి కూడా కెసిఆర్ పై అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన తెలంగాణ యువ జెఏసి పేరుతో ఇన్నాళ్లూ నెట్టుకొచ్చారు. కెసిఆర్‌ను ధీటుగా ఎదుర్కోవాలంటే జగన్ పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చిన ఆయన ఎట్టకేలకు నిన్ననే ఆ పార్టీలో చేరారు. ఓ వైపు తెలంగాణ ఉద్యమం జోరుగా ఉన్నప్పటికీ.. కెసిఆర్ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలు జగన్‌ను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.

కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కెక మహేందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణా రెడ్డిలతో పాటు వరంగల్, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కెసిఆర్ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలకు జగన్ పార్టీ గాలం వేస్తోందని అంటున్నారు. అయితే టిడిపి, కాంగ్రెసు ప్రజా ప్రతినిధులపై నేరుగా దృష్టి సారించినట్లుగా టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై మాత్రం పెట్టడం లేదని అంటున్నారు.

గతంలో టిఆర్ఎస్‌లో పని చేసిన పలువురు జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే జగన్ పార్టీ నుండి తెలంగాణపై అనుకూల ప్రకటన ఏదైనా వస్తుందా అనే దానికోసం వేచి చూస్తున్నారట. వచ్చినా రాకున్నా తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడం, రాష్ట్రంలో జగన్ పార్టీ హవా కొనసాగుతున్న నేపథ్యంలో సాధారణ ఎన్నికలకు ముందు మాత్రం జగన్ పంచన చేరడం ఖాయమంటున్నారు.

మరోవైపు నిన్నటి వరకు అదిగో తెలంగాణ ఇదిగో తెలంగాణ వస్తుందనే ప్రకటనలు గుప్పించిన కెసిఆర్‌కు కాంగ్రెసు పట్ల నమ్మకం సడలిందట. దీంతో అతను టిడిపి, కాంగ్రెసు నేతలపై గురి పెట్టారట. ఓ వైపు పార్టీలోకి ఆ పార్టీల నుండి ప్రజాప్రతినిధులను ఆకర్షిస్తూనే ఇంకోవైపు జెఏసితో కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చారు.

బాబును ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు...

కెసిఆర్ మంగళవారం మధ్యాహ్నం టిడిపి నుండి బహిష్కరించబడిన హరీశ్వర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. హరీశ్వర్ కూడా తెరాసలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు. కాంగ్రెసుపై నమ్మకం పోవడంతో ఉద్యమ ఉధృతికి ప్లాన్ చేస్తున్న కెసిఆర్ మరోవైపు పాదయాత్ర పేరుతో తెలంగాణలో తిరుగుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకే హరీశ్వర్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్లారని అంటున్నారు.

కెసిఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారనే పేరు ఉంది. అందుకు తగ్గట్లే బాబును, టిడిపి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఇలా చేశారని అంటున్నారు. కాంగ్రెసు ప్రజా ప్రతినిధులకు కూడా కెసిఆర్ గాలం వేస్తున్నారని చెబుతున్నారు. పలువురు కాంగ్రెసు ఎంపీలు కెసిఆర్‌తో కలిసిపోయేందుకు సిద్ధంగా ఉన్నారట. వారు అదును కోసం వేచి చూస్తున్నారట. ఎంపీల లైన్ క్లియర్ కావడంతో ఇక కెసిఆర్ ఎమ్మెల్యేల వైపు దృష్టి సారిస్తున్నారని అంటున్నారు.

English summary
YSR Congress party chief and Kadapa MP YS Jaganmohan Reddy and Telangana Rastra Samithi chief K Chandrasekhar Rao are started Operation Akarsh again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X