గడ్కరీ రాజీనామాకు సుష్మ డిమాండ్: తెరపైకి అద్వానీ

పార్టీ సీనియర్ నేత, లోకసభా పక్ష నేత సుష్మా స్వరాజ్ నితిన్ గడ్కరీ రాజీనామాకు మంగళవారం డిమాండ్ చేశారు. గడ్కరీ రాజీనామా చేయాలని, ఆయన స్థానంలో పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి బాధ్యతలు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. అంతకుముందు పార్టీ సీనియర్ నేతలు జశ్వంత్ సింగ్, యశ్వంత్ సింగ్ కూడా నితిన్ గడ్కరీని పార్టీ అధ్యక్షుడిగా తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రముఖ న్యాయవాది, బిజెపి నేత రాం జెఠ్మలానీ ఎప్పటి నుండి గడ్కరీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఆయనను అధ్యక్ష స్థానం నుండి తొలగించాలని, ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గడ్కరీపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడే జెఠ్మలానీ స్పందించారు. ఆయనను తొలగించాలని తాను ఎప్పుడో పార్టీలో చెప్పానన్నారు. తాజాగా స్వామి వివేకానందతో దావూద్‌ను పోల్చడం గడ్కరీకి మరిన్ని చిక్కులు తెచ్చి పెట్టింది.












Click it and Unblock the Notifications