వారు బానిసలు కారు, కెసిఆర్ అవతారపురుషుడు: టిజి

ఎన్నికల సమయంలోనే తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చునన్నారు. అంత వరకు రాష్ట్రాన్ని అభివృద్ది చేసుకోవాలని సూచించారు. ఎవరు కూడా అభివృద్ధికి అడ్డుపడవద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణపై నిర్ణయం రాదని భావిస్తే తమ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు ఇంకో పార్టీలో చేరరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అంతగా అవసరమైతే వారు తెలంగాణ కాంగ్రెసు పేరుతో ఓ ఫ్రంట్ పెట్టుకొని ఉద్యమిస్తారు. అంతేకానీ తెలంగాణ రాష్ట్ర సమితికి బానిసలుగా మారరని ఆయన అన్నారు. తెరాసలోకి వెళ్లే అవసరం వాళ్లకు లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చరని చెప్పారు. ఆయనను మారిస్తే ఆ పదవి తీసుకునేందుకు ముందుకు వచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేరని చెప్పారు.
కెసిఆర్ దసరా, దీపావళి బుల్లోడు వేషాల నుండి ఇప్పుడు నరసింహావతారానికి మళ్లారని ఎద్దేవా చేశారు. తెలంగాణపై నిర్ణయం తీసుకునే అవకాశం కాంగ్రెసుకు లేదన్నారు. కెసిఆర్ అవతారపురుషుడు అని, ఆయన రెచ్చగొట్టకుండా పిల్లల్ని బతికిస్తే బాగుంటుందని ఆయన సూచించారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేయవద్దన్నారు.త












Click it and Unblock the Notifications