• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జగన్ పార్టీలోకి సంకినేని: విజయమ్మ హాజరు

By Srinivas
|
Sankineni Venkateshwara Rao
నల్గొండ: జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత సంకినేని వెంకటేశ్వర రావు ఆదివారం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారు. నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో జరిగే భారీ బహిరంగ సభలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సమక్షంలో ఆయన జగన్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారు. బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కాగా సంకినేని వెంకటేశ్వర రావు గత నెల జైలులో జగన్‌ను కలవడంతో పాటు విజయమ్మతో కూడా భేటీ అయిన విషయం తెలిసిందే. అప్పుడే ఆయన జగన్ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. జగన్‌ను జైలులో కలిసిన వెంటనే పార్టీ ఇతనిని బహిష్కరించింది. అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసినందుకు అతనిని పార్టీ సస్పెండ్ చేసింది.

బహిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాను సూర్యాపేటలో వచ్చే నెల 11న లేదా 15న వైయస్ విజయమ్మ సమక్షంలో పార్టీలో చేరతానని గతంలో చెప్పారు. దీనిపై చర్చించేందుకు సంకినేని ఈ రోజు ఆమెను కలిసినట్లుగా తెలుస్తోంది. కాగా జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత సంకినేని వెంకటేశ్వర రావు జైల్లో ఉన్న జగన్‌ను సోమవారం మధ్యాహ్నం ములాఖత్ సమయంలో కలిశారు. నల్గొండ జిల్లాలో సంకినేని వెంకటేశ్వర రావుకు మంచి పట్టు ఉంది.

ఆయన తెలుగుదేశం పార్టీలో జిల్లాలో కీలక నేతగా ఉన్నారు. అలాంటి సంకినేని పార్టీ వీడటం జిల్లాలో టిడిపికి గట్టి దెబ్బే అంటున్నారు. జైలులో జగన్‌ను కలిసిన అనంతరం సంకినేని చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. హీరో నందమూరి బాలకృష్ణ వియ్యంకుడు కాబట్టి బాబుకు మద్దతిస్తున్నారని, అదే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే బాలయ్య బాబు ఇప్పటి వరకు బయటకు రాకుండా జైలులోనే ఉండేవాడని ఆరోపించారు.

చంద్రబాబు కాంగ్రెసు పార్టీతో కలిసిపోయారని, వచ్చే సాధారణ ఎన్నికలలో కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి పాలన అందించాలనే సదుద్దేశ్యంతో పార్టీని స్థాపించారన్నారు. జగన్‌ను ఎదుర్కోలేని చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అతన్ని జైలులోనే ఉంచాలని కుటిల యత్నాలు చేస్తున్నారన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

మరిన్ని ys vijayamma వార్తలుView All

English summary
Nalgonda district Sankineni Venkateshwara Rao is joining in YSR Congress party on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more