నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రాలకు చింతకాయలు రాలవు: కెసిఆర్‌పై బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మంత్రాలకు చింతకాయలు రాలవని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు వస్తున్నా.. మీ కోసం పాదయాత్రలో భాగంగా ఆయన నిజామాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. బాన్సువాడ బహిరంగ సభలో మాట్లాడారు. ఉత్తర తెలంగాణ ఎండిపోకూడదని తాను బాబ్లీకి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లానని ఆయన గుర్తు చేశారు.

తెరాస ఏ విధమైన పోరాటాలు చేయలేదని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ అభివృద్ధికి చేసిందేమీ లేదని ఆయన విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డిని కిరికిరి ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు. గ్యాస్ సిలిండర్ల వ్యవహారంతో కిరణ్ కుమార్ రెడ్డి కిరికిరి చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తెలంగాణకు చేసిందేమీ లేదని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లో జనాభా దామాషా ప్రాతిపదికపై నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల రోజు మొహమాటం వద్దని, తనకు అవకాశం ఇవ్వాలని, ఆ అవకాశం ఇస్తే ఐదేళ్లు మీ సేవడకుడిగా ఉంటానని ఆయన ప్రజలను కోరారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి దినపత్రిక తప్పుడు కథనాలు రాస్తోందని ఆయన అన్నారు.

కాంగ్రెసు పార్టీతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రతిపాదిస్తామని ఆయన చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పారు. రైతుల రుణమాఫీ చేసి తీరుతానని స్పష్టం చేశారు. తాను బాబ్లీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు తెరాస నాయకులు ఎక్కుడున్నారని ఆయన అడిగారు.

వైయస్ రాజశేఖర రెడ్డి తన కుమారుడికి లక్ష కోట్లు దోచి పెట్టాడని, ఆ సొమ్ముతో రైతుల రుణాలను మూడు సార్లు మాఫీ చేయవచ్చునని చంద్రబాబు అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అత్యాశ వల్లనే ప్రజలకు కష్టాలు వచ్చి పడ్డాయని అన్నారు. రైతు పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చూస్తామని అన్నారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పార్టీ అభ్యర్థిగా బజ్యానాయక్‌ పేరును చంద్రబాబు ప్రకటించారు.

English summary
Telugudesam president N Chandrababu Naidu said that Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao is uttering waste words. He said that he taught against Babli project for the cause of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X