హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'రియాల్టర్' కిరణ్!: రింగ్ రోడ్డుపై స్టూడెంట్స్‌కు వార్నింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇందిర బాట కార్యక్రమం రంగారెడ్డి జిల్లాలో సోమవారం ప్రారంభమైంది. కిరణ్ ఉదయం కొండ్లకోయ వద్ద శామీర్‌పేట - పటాన్ చెరువు ఔటర్ రింగు రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఔటర్ రింగు రోడ్డుతో రంగారెడ్డి జిల్లా దశ మారుతుందన్నారు. ప్రజల ఆస్తుల విలువ ఒకటికి పది రెట్లు పెరిగిందన్నారు. ఇంకా పెరుగుతుందని చెప్పారు. రింగురోడ్డు చుట్టు పక్కన ఉన్న ప్రజలు ఎవరూ తమ భూములను అమ్ముకోవద్దని సూచించారు.

రింగురోడ్డు పరిసర ప్రాంతాల వారి భూములకు మంచి గిరాకీ ఉంటుందని, ఎవరూ ప్రలోభాలకు లొంగి అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేశారు. రింగు రోడ్డు వల్ల అత్యధికంగా లాభం రంగారెడ్డి జిల్లా ప్రజలకే అన్నారు. జిల్లాలో ఒక ఎకరా ఉన్న వారు కూడా కోటీశ్వరులయ్యారన్నారు. మీ స్థిరాస్తి మీ వద్దనే ఉంచుకోవాలని, ముందు ముందు మరింత మంచి భవిష్యత్తు ఉంటుందని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. జిల్లా దశ మారుతుందన్నారు.

విద్యార్థులు రింగు రోడ్డు పైన హద్దులు మీరవద్దని హెచ్చరించారు. జాగ్రత్తగా ఉండాలని కోరారు. పైరవీలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదే అన్నారు. రోజుకు వెయ్యి ఉద్యోగాలను త్వరలో ఇస్తామన్నారు. అనంతరం ఆయన వ్యవసాయ, ఉద్యానవన, బిందు సేద్య రైతులతో మాట్లాడారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏడు గంటల పాటు ఉచిత విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా శామీర్‌పేటకు సాగు, తాగు నీరు అందిస్తామన్నారు. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని చెప్పారు. విద్యుత్ తదితరుల సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని చెప్పారు. అనంతరం అక్కడి అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. జిల్లాలో నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం ఇందిరమ్మ బాట సాగనుంది.

English summary
CM Kiran Kumar Reddy's Indira Bata program started in Ranga Reddy district on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X