జగన్ నుంచే కాదు, టిడిపి నుంచీ రావచ్చు: జయసుధ

ఇది కూడా సినిమాల్లో ఆఫర్ వచ్చినట్టేనని, ఒకేసారి చాలా సినిమాల్లో ఆఫర్లు వస్తే ఆ సినిమా చేస్తే బాగుంటుందా? అందులో నా పాత్ర పండుతుందా? అంతిమంగా సినిమా సక్సెస్ అవుతుందా, లేదా? అన్నది చూసుకోవాలని, పార్టీల విషయంలోనూ అంతేనని ఆమె వివరణ ఇచ్చారు.
సినిమాల్లో తనకు ఇష్టమున్నా, లేకున్నా నటించాల్సిందేనని, అక్కడ ప్రత్యర్థులుగా ఉండే హీరోతోనూ, విలన్‌తోనూ నటిస్తామని, అలాగే పార్టీలో నచ్చిన వాళ్లుంటారు, నచ్చని వాళ్లుంటారని, అయినా అదే పార్టీలో కొనసాగాల్సి ఉంటుందని అన్నారు. పార్టీ మారే ఉద్దేశం ఉందా? అని ప్రశ్నిస్తే ప్రజలు తనకు 2014 వరకు పదవిలో ఉండే అవకాశం ఇచ్చారని, వారు ఏం ఆశించి తనను గెలిపించారో ఆ బాధ్యతలను పూర్తి చేయాలని, ఏదైనా 2014 తర్వాత ఆలోచిస్తానని ఆమె సమాధానం ఇచ్చారు.
ఎమ్మెల్యేగా ఉన్నా, పనులు కావడం లేదని నిస్పృహ వ్యక్తం చేసిన జయసుధకు తెలుగుదేశం శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఆదివారం జయసుధ పిచ్చాపాటీగా మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న సమస్యలు, పనులు కాకపోవటం వల్ల తలెత్తుతున్న ఇబ్బందుల గురించి చెప్పారు. "మీరు చెప్పినవన్నీ నిజం. కాని, వాటికి మనం భయపడకూడదు. పోరాటం చేయకుండా ఏ పనీ కాదు. నిరాశ చెందితే ఏదీ సాధించలేం'' అని మోత్కుపల్లి అన్నారు.












Click it and Unblock the Notifications