ఢిల్లీ భారీ అగ్ని ప్రమాదం, 22 ఫైర్ ఇంజన్లు

అగ్ని ప్రమాదంలో ప్రజలు ఎవరూ చిక్కుకోలేదని తెలుస్తోంది. ఫైర్ ఫైటర్స్ లోనికి వెళ్లే పరిస్థితి లేదు. దాంతో పక్కల నుంచి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్, మంటలను ఆకర్షించే సరుకులు ఉండడంతో ఫైర్ ఫెటర్స్ లోనికి వెళ్లలేకపోయినట్లు తెలుస్తోంది.
అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమై ఉండవచ్చునని ఊహిస్తున్నారు. ఇరుగ్గా ఉండే చాందినీ చౌక్‌లో మంటలు సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications