పూరింటికి నిప్పు: చిన్నారి మృతి, భార్యకు భర్త నిప్పు

Chittoor Dist
చిత్తూరు/విశాఖపట్నం: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుందగి. పుంగనూరు మండలం సోమల సమీపంలోని వడ్డేపల్లిలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మనోహర్ అనే కూలికి చెందిన పూరింటికి నిప్పంటించారు. పూరింటికి నిప్పంటించిన సమయంలో లోపల మంజునాథ, వేద, అనూష అనే ముగ్గురు చిన్నారులు ఉన్నారు. నిద్రిస్తున్న ఆ ముగ్గురు చిన్నారులు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.

వారి ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నాలుగేళ్ల అనూషకు గాయాలు తీవ్రం కావడంతో చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ఇద్దర్నీ అదే ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

భార్యకు నిప్పంటించిన భర్త

విశాఖ జిల్లా చిట్టివలసలో కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఓ భర్త. అనంతరం అతను కూడా నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య తీవ్రంగా గాయపడింది. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య

హైదరాబాదులోని వెంకటరెడ్డి నగర్‌లో ఓ హెడ్ కానిస్టేబుల్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంబరుపేట పోలీసు స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా అతను పని చేస్తున్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+