మోడీ ప్రమాణ స్వీకారం: బాలయ్యకు చంద్రబాబు బ్రేక్‌లు

చంద్రబాబు వైఖరి తెలియడంతో బాలయ్య తన గుజరాత్ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం కరీంనగర్ జిల్లాలో జరిగిన తెలంగాణ నాయకుల సమావేశంలో చంద్రబాబు వద్ద బాలయ్యకు మోడీ నుంచి అందిన ఆహ్వానం విషయం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. మోడీ ఆహ్వానం తనకు కూడా అందిందని చంద్రబాబు చెప్పారు.
బాలకృష్ణ పార్టీ మనిషి అని, మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లకపోవచ్చునని చంద్రబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీతో స్నేహం చేస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లాలనే బాలయ్య ఆలోచనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నటుడిగా బాలయ్య మోడీ ప్రమాణ స్వీకారానికి వెళ్తే తమకు అభ్యంతరం లేదని, అయితే తెలుగుదేశం పార్టీలో బాలయ్య క్రిశీలక పాత్ర పోషిస్తున్నారని, మోడీ ప్రమాణ స్వీకారానికి బాలయ్య వెళ్తే చంద్రబాబుకు మచ్చేనని ఆయన అన్నారు.
సిపిఐతో స్నేహాన్ని చెడగొట్టడానికి ఇష్టంగా లేని చంద్రబాబు బాలయ్య ఆలోచనలకు వ్యతిరేకంగా ప్రతిస్పందించినట్లు చెబుతున్నారు. వామపక్షాల హెచ్చరికలు కూడా బాలయ్య మనసు మార్చుకోవడానికి కారణమని అంటున్నారు. మోడీ ప్రమాణ స్వీకారానికి బాలయ్య వెళ్లడం లేదని చంద్రబాబు చెప్పారు. తనకు కూడా ఆహ్వానం అందిందని, తాను కూడా వెళ్లడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications