రేప్: అందంగా ముస్తాబై వస్తున్నారన్న రాష్ట్రపతి కొడుకు

దీనిపై అభిజిత్ స్పందించారు. కొవ్వత్తుల ప్రదర్శన ప్యాషన్ అయిపోయిందని, ఢిల్లీ గ్యాంగ్ రేప్ పైన ఆందోళన చేస్తున్న వారంతా నిజమైన ఆందోళనకారులు కారని, నిజమైన వారే అయితే అలా ప్రవర్తించరని అన్నారు. విద్యార్థుల ముసుగులో ప్రతిపక్షాలు దీనిని చేపడుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. ఆందోళన చేస్తున్న వారికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తాను కూడా విద్యార్థినేనని, విద్యార్థులు ఎలా నడుచుకుంటారో తనకు తెలుసునన్నారు.
ఈ ఘటనపై ఆందోళన చేసేందుకు వస్తున్న కొందరు మహిళలు అలంకరించుకొని వస్తున్నారని, వారే టీవిల్లో ఇంటర్వ్యూలు ఇస్తున్నారన్నారు. వారు అసలైన విద్యార్థులు కాదనేది తన అభిప్రాయమని, ఎందుకంటే తమను తాము విద్యార్థులుగా చెప్పుకుంటున్నప్పటికీ ఆ ఏజ్ గ్రూప్ మహిళలు సాధారణంగా విద్యార్థులగా ఉండరని చెప్పారు. ఈ వ్యాఖ్యలను లెఫ్ట్ నేత బృందాకారత్, కిరణ్ బేడీ ఖండించారు. కాగా తన వ్యాఖ్యలపై అబిజిత్ ముఖర్జీ తర్వాత క్షమాపణలు చెప్పారు.












Click it and Unblock the Notifications