అటెండర్ పోస్ట్ రెడీ: హరీష్‌పై లోకేష్ సంచలన వ్యాఖ్య

దీనిపై ట్విట్టర్‌లో నారా లోకేష్ స్పందించాడు. హరీష్ రావు అటెండర్ పోస్టు దరఖాస్తు కోసం ఎన్టీఆర్ భవనం ఎదురు చూస్తోందని, కెటిఆర్ రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలని ఆతను ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. కాగా సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు గతంలో... తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే తాను ఎన్టీఆర్ భవనంలో అటెండర్‌గా పని చేస్తానని ప్రకటించారు.
అదే పార్టీకి చెందిన సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు కూడా చంద్రబాబు నాయుడు కేంద్రానికి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే తాను పోటీ నుండి తప్పుకుంటానని ప్రకటించారు. కెటిఆర్, హరీష్ రావులు చేసిన ప్రకటనలకు కౌంటర్‌గా నారా లోకేష్ ట్విట్టర్‌లో స్పందించాడు. ఇది ఇప్పుడు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలో చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications