వోల్వోబస్సులో విదేశీ యువతులకు లైంగిక వేధింపులు

తాజాగా ఐటి హబ్ నగరంగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో ఇద్దరు భూటాన్ యువతులు లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ ఘటన ఇటీవలే వెలుగులోకి వచ్చింది. వారిద్దరు వోల్వో బస్సులో ప్రయాణిస్తుండగా.. ఆ బస్సు డ్రైవర్, కండక్టర్ భూటాన్ యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు. భూటాన్ యువతులు ఇద్దరు అక్కా చెల్లెళ్లు. పోలీస్ కంట్రోల్ రూంకు సమాచారం అందించిన అక్కడి నుండి తమకు ఎలాంటి సహాయం అందలేదని వారు ఆరోపిస్తున్నారు.
వారిద్దరూ శుక్రవారం నగరంలో వోల్వో బస్సు డ్రైవర్, కండక్టర్ పైన ఫిర్యాదు చేశారు. డ్రైవర్, కండక్టర్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారని వారు ఆరోపించారు. తాను బస్సు దిగుతున్న సమయంలో కండక్టర్ తన జడను పట్టుకొని కూడా లాగాడని అందులో ఓ యువతి చెప్పింది.
బస్సులో పలువురు ప్రయాణీకులు ఉన్నప్పటికీ తమను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. వోల్వో బస్సులను నడుపుతున్న బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్సుపోర్టు కార్పోరేషన్ నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. తప్పు చేస్తే వారికి శిక్ష తప్పదని ప్రకటించింది.












Click it and Unblock the Notifications