నారా లోకేష్‌పై పోలీసులకు తెలంగాణ లాయర్ల ఫిర్యాదు

నారా లోకేష్ చరిత్రహీనుడని తెలంగాణ న్యాయవాదులు వ్యాఖ్యానించారు. లోకేష్ తండ్రి చంద్రబాబు కుట్రలను బద్దలు కొట్టడానికే హరీష్ రావు సవాల్ చేశారని వారన్నారు. తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు లోకేష్‌ను డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత లోకేష్‌కు తెలంగాణ సచివాలయంలో అటెండర్ ఉద్యోగం ఇస్తామని వారు వ్యాఖ్యానించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని వారు లోకేష్‌ను హెచ్చరించారు.
2009లో తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని, దానిపై హరీష్ రావు ఆ సవాల్ చేశారని వారన్నారు. చంద్రబాబు కుట్రలను బయటపెడతామని వారన్నారు.
హరీష్, నీ అటెండర్ పోస్టు దరఖాస్తు కోసం ఎన్టీఆర్ భవన్ ఎదురు చూస్తోందని నారా లోకేష్ శుక్రవారం ట్విట్టర్‌లో రాశాడు. అలాగే కెటిఆర్, రాజీనామా ఎప్పుడు చేస్తారో చెప్పాలని రాశాడు. శుక్రవారం అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అనుకూల వైఖరి చెప్పిందనే ఉద్దేశ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నారా లోకేష్ ఆ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తెలంగాణకు సై అంటే ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో అటెండర్ ఉద్యోగం చేస్తానని హరీష్ రావు, తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని కెటి రామారావు గతంలో వేర్వేరు సందర్భాల్లో అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ తనపై ట్వీట్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు హరీష్ రావు దీటుగానే కౌంటర్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో అటెండర్ ఉద్యోగం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే తన తండ్రి చంద్రబాబుతో నారా లోకేష్ జై తెలంగాణ అనిపించాలని ఆయన సవాల్ చేశారు. ఈ మేరకు ఆయన ఫేస్‌బుక్‌లో నారా లోకేష్‌కు జవాబు ఇచ్చారు.












Click it and Unblock the Notifications