వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్బర్ సహకరిస్తానని చెప్పాడు: డిజిపి దినేష్ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

DGP Dinesh Reddy
హైదరాబాద్: విచారణకు సహకరిస్తానని మజ్లీస్ శానససభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సహకరిస్తానని చెప్పినట్లు, ఈ మేరకు తమకు సమాచారం అందించినట్లు డిజిపి దినేష్ రెడ్డి చెప్పారు. ఏం చేయాలనే విషయంపై రెండు మూడు రోజుల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆయన కలిశారు.

రంగారెడ్డి జిల్లా తాండూరులో మజ్లీస్ శనివారం తలపెట్టిన బహిరంగ సభకు ఏ విధమైన అభ్యంతరాలు లేవని ఆయన చెప్పారు. అత్యాచారం కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రెండు నెలల్లోగా ట్రయల్ పూర్తయ్యేలా చూస్తామని ఆయన అన్నారు.

అక్బరుద్దీన్ ఓవైసీ లండన్‌లో చికిత్స చేయించుకుంటున్నట్లు ఆయన సోదరుడు, మజ్లీస్ అధినేత, హైదరాబాదు పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో అక్బరుద్దీన్ ఓవైసీ చేసి ద్వేషపూరిత ప్రసంగంపై పలు చోట్ల కేసులు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇదిలావుంటే, అక్బరుద్దీన్‌కు హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10వ తేదీన తమ ముందు హాజరు కావాలని వారు అక్బరుద్దీన్‌ను ఆదేశించారు. అక్బరుద్దీన్‌పై 153 (ఎ) సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం ఎబివిపి కార్యకర్తలు పోలీసు స్టేషన్ ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే.

English summary
DGP Dinesh Reddy said that MIM MLA Akbaruddin has sent information saying he will cooperate with the police investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X