హైకోర్టుకు అక్బర్: అసద్ సంచలన వ్యాఖ్య, స్పీచ్‌పై పిల్

అక్బర్ ఇంటికి వైద్యుల్ని పంపే యోచనలో పోలీసులు
అనారోగ్య కారణాలతో అక్బరుద్దీన్ నిర్మల్ పోలీసు స్టేషన్‌లో హాజరు కాలేదని అతని తరఫు న్యాయవాదులు ఈ రోజు పోలీసులకు తెలియజేశారు. అతనికి మరో నాలుగు రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అయితే అక్బరుద్దీన్ ఆరోగ్యం వాస్తవంగానే బాగా లేదా అని తెలుసుకునేందుకు అదిలాబాద్ జిల్లా పోలీసులు ప్రభుత్వ వైద్యులను అతని ఇంటికి పంపే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్బర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అసద్ సంచలన వ్యాఖ్యలు
మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాదులో సమస్యలు సృష్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అతని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను నగర కమీషనర్ దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. ఈ నెల 24, 25 తేదీలలో కుట్ర విషయాలను బయటపెడతానన్నారు. 2014 కంటే ముందే ఎన్నికలు వస్తాయని, తాము అత్యధిక స్థానాలను గెలుపొందుతామన్నారు.
అక్బరుద్దీన్ ప్రసంగాలపై పిల్
గూగుల్, యూట్యూబ్‌లలో ఉన్న అక్బరుద్దీన్ ప్రసంగాలను తొలగించాలని హైకోర్టులో పిల్ వేశారు. అక్బరుద్దీన్ ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించేందుకు ఆదేశాలు జారీ చేయాలని దరఖాస్తులో దరఖాస్తుదారుడు కోరారు.












Click it and Unblock the Notifications