సెంచరీ కొట్టిన బాబు!: వంద గజాల్లో వంద ఫీట్స్ పైలాన్

బాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకోవడంతో వంద అడుగుల పైలాన్‌ను ఏర్పాటు చేశారు. దీనిని వంద గంటల్లో, వంద గజాల్లో వంద అడుగుల ఎత్తున ఏర్పాటు చేశారు. చంద్రబాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్నందుకు గుర్తుగా ఇది ఎప్పటికీ నిలిచి పోవాలనే భావనతో దీనిని నిర్మించినట్లు ఖమ్మం టిడిపి పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు దీనిని ప్రత్యేకంగా నిర్మాణ పనులు చేపట్టారు.
చంద్రబాబు అక్టోబర్ 2వ తేదిన జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన రోజునాడు తన పాదయాత్రను అనంతపురం జిల్లాలోని హిందూపురంలో ప్రారంభించారు. బాబు పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. అనంతపురం, కర్నూలు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్‌ల మీదుగా చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం జిల్లాకు చేరుకుంది. బాబు పాదయాత్ర టిడిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకు వస్తోంది.
బాబు పాదయాత్ర వంద రోజులకు చేరడంతో రాష్ట్రవ్యాప్తంగా టిడిపి శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. తమకు ఇది ఓ పండుగ దినం అని వారు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా వంద రోజుల పాదయాత్ర సందర్భంగా చంద్రబాబు కేక్ కట్ చేశారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!!












Click it and Unblock the Notifications