తెలంగాణ ద్రోహి సెటిలర్ సుధేష్: మా హైదరాబాద్

హైదరాబాదుపై ప్రజాభిప్రాయం కోరండ అంటే తెలంగాణకు వ్యతిరేకమేనని, సుధేష్ రాంభొట్లలాంటి సెటిలర్లు ఈ గడ్డపై బతుకుతూ ఈ గడ్డకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారన్నారు. హైదరాబాదుకు వలసలు కొత్తేమీ కాదని, ముల్కీ గైర్ ముల్కీ ఉద్యమాలు చరిత్రలు చాలా జరిగాయని, ఉద్యమాలు జరిగిన ప్రతిసారి ముల్కీలే హైదరాబాదును వలసవాదుల నుంచి రక్షించుకున్నారని వారు వివరించారు.
ఇప్పుడు సుధేష్ లాంటి వలసవాదులు కొత్తగా వచ్చి చెప్పేదేమీ లేదని, ఈ నగర చరిత్ర చదవుకుంటే మంచిదని, ఇప్పుడు తెలంగాణవాదులెవరూ సెటిలర్లను వెళ్లిపోవాలని చెప్పడం లేదని వారన్నారు ఈ నగరం ముమ్మాటికీ తమ అబ్బ సొత్తేనని, ఈ గడ్డకు ఎవరైనా రావచ్చు, ఇక్కడినుంచి ఎవరైనా పోవచ్చునని, బంగళాలు కట్టుకోవచ్చునని, వ్యాపారాలు చేసుకోవచ్చునని, ఇక్కడి సెటిలర్లను తామే కాపాడుకుంటామని అన్నారు
అంతేగాని ఇంట్లోకి రమ్మంటే ఇల్లంతా నాదే అంటే తరిమి కొట్టక తప్పదని, ఈ పరిస్థితి రాకముందే ఇష్టంలేని వ్యక్తులు మర్యాదగా నగరం వదిలిపెట్టి వెళ్లిపోవచ్చునని, సుధేష్ లాంటి తెలంగాణ ద్రోహులను హైదరాబాద్ ముల్కీలెవ్వరూ ఉపేక్షించబోరని వారన్నారు. ముల్కీలను రెచ్చగొడితే తీవ్ర పరిణామాలుంటాయని వారు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications