మహిళస్నానం చిత్రీకరించిన ఎమ్మెల్యే గన్‌మెన్ కొడుకు

West Godavari
ఏలూరు/హైదరాబాద్: ఓ మహిళ స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించిన శాసనసభ్యుడి గన్‌మెన్‌ కొడుకును పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ట్రాన్సుకో అతిథి గృహంలో ఓ మహిళ స్నానం చేస్తుండగా ఎమ్మెల్యే సుబ్బారాయుడు గన్‌మెన్ కొడుకు వీడియోను తీశాడు. దీనిని గమనించిన ఆ మహిళ విషయాన్ని తన భర్తకు చెప్పింది. ఆ దంపతులు శివ కుమార్ పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాను స్నానం చేస్తుండగా అతను వీడియో తీశాడని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎమ్మెల్యే గన్‌మెన్ కొడుకును అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి చిత్రీకరించిన సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దిల్‌సుఖ్‌నగర్‌లో కూలిన భవనం పాతగోడ

రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఓ అపార్టుమెంటులోని పాత గోడ కూలింది. పి అండ్ టి కాలనీలో ఇది జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఉన్న లక్ష్మయ్య అనే వ్యక్తిని కాపాడారు. మరో ఇద్దరు శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందారు.

ఆర్కే బీచ్‌లో ఆత్మహత్యాయత్నం

విశాఖపట్నంలోని ఆర్‌కే బీచ్‌లో సోమవారం ఉదయం ఓ మహిళ, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. గుర్తించిన బీచ్ పెట్రోలింగ్ పోలీసులు ఆమెను రక్షించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+