హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎస్సై లైంగిక వేధింపు: లేఖరాసి మహిళాటీచర్ అదృశ్యం

By Srinivas
|
Google Oneindia TeluguNews

SI harrases Woman Teacher
హైదరాబాద్: తనను ఎస్సై వేధిస్తున్నాడని, ఆయన వేధింపులు తాళలేక తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసిన ఓ మహిళా టీచర్ రెండు రోజులుగా కనిపించడం లేదు. దుండిగల్ ఎస్సైగా పని చేస్తున్న సుధీర్ అడ్డగుట్టలో నివసిస్తున్నాడు. సుధీర్ ఇంటి ఎదురుగా లీల కుటుంబం ఉంటుంది. లీలా ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. ఎస్సై గత కొన్నాళ్లుగా లీలను వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని లీల తన భర్తకు తెలియచెప్పింది.

వేధించవద్దని ఎస్సైతో చెప్పినప్పటికీ ఆపలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల వేధింపులు మరింత ఎక్కువయ్యాయని వారు అన్నారు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని లేదంటే చంపేస్తానని లీలను బెదిరించాడు. దీంతో ఎస్సై వేధింపులు తట్టుకోలేక రెండు రోజుల క్రితం లీల తాను చనిపోతానంటూ లేఖ రాసి అదృశ్యమైంది. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమల రావు సీరియస్‌గా తీసుకున్నారు.

ఆయన వెంటనే ఎస్సైను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ ఉత్తర్వులు జారీ అయినప్పటి నుండి ఎస్సై అజ్ఞాతంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో పలుమార్లు ఎస్సై లీలను వేధించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సైను దుండిగల్ పోలీసు స్టేషన్‌కు బదలీ చేశారు. అక్కడకు వెళ్లినా ఎస్సై తీరులో మార్పు రావడంతో బుధవారం సాయంత్రం ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. ఎస్సై వేధింపులపై విచారణ జరిపించడంతో నిజమేనని తేలింది.

లీల ఆచూకి కనుగొనాలని కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు. ఆమె ఆచూకీ దొరకకపోవడం తమను ఆందోళనకు గురి చేస్తోందన్నారు. లీల భర్త బుధవారం సైబరాబాద్ కమిషనర్ దృష్టికి ఎస్సై వ్యవహారాన్ని తీసుకు వెళ్లారు.

English summary
SI harrases Woman Teacher.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X