స్వీట్ తినిపించారు!: సీమాంధ్రలో కెసిఆర్ బర్త్‌డే వేడుక

కాగా ఈ రోజు(17 ఫిబ్రవరి)న కెసిఆర్ పుట్టిన రోజు. ఆయన అరవయ్యవ ఏటలోకి ప్రవేశించారు. తెలంగాణలోని ఆత్మహత్యల నేపథ్యంలో తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవద్దని ఆయన నిర్ణయించుకున్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎవరు వేడుకలను నిర్వహించవద్దని ఆయన నాలుగు రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెసు నేతలపై బైండోవర్ కేసులు
రాష్ట్ర రాజధాని హైదరాబాదులో సమైక్యాంధ్రకు అనుకూలంగా ర్యాలీలు జరిపే ప్రయత్నాలు చేస్తున్నారని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ హైదరాబాదులో ఆరోపించారు. తెలంగాణవాదులపై బైండోవర్ కేసులు సరికాదన్నారు. బైండోవర్ కేసులు మాట తప్పిన కాంగ్రెసు నేతల పైన పెట్టాలన్నారు. తెలంగాణపై వారు మాట ఇచ్చి తప్పారని ఆయన ఆరోపించారు.
త్వరలో తలపెట్టిన సడక్ బందుకు విజయవంతం చేసేందుకు నియోజకవర్గానికో ఇంచార్జిని నియమిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఐక్యకార్యాచరణ సమితి మద్దతిస్తున్న పార్టీలకే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ మంత్రులు వచ్చినా రాకున్నా తెలంగాణ ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications