షాకింగ్ పిక్చర్స్: ప్రభాకరన్ కుమారుడిని ఇలా చంపారు

చెన్నై: ఎల్టిటిఇ అధినేత ప్రభాకరన్ మరణం తర్వాత చాలా కాలానికి అత్యంత ఆశ్చర్యానికి, గగుర్పాటుకు గురి చేసే కొన్ని చిత్రాలు వెలికి వచ్చాయి. శ్రీలంక సైన్యం కిరాతకాన్ని చూపించే దారుణమైన చిత్రాలు వెలుగు చూశాయి. ప్రభాకరన్ 12 ఏళ్ల కుమారుడు బాలచంద్రన్‌ను శ్రీలంక సైన్యం పట్టుకుని అత్యంత దారుణంగా హింసించి చంపిన తీరుకు అద్దం పట్టే ఫోటోలు వెలుగు చాశాయి.

బాలచంద్రన్‌కు సంబంధించిన కొన్ని ఛాయాచిత్రాలను చానెల్ 4 మరోసారి ప్రచురించింది. ఇసుక సంచులు నింపిన టెంట్ కింద శ్రీలంక సైన్యం ఆపరేట్ చేసిన బాలచంద్రన్ కూర్చున్న ఛాయాచిత్రాలను ఆ చానెల్ ప్రచురించింది. అంతకు ముందు ఇదే చానెల్ బాలుడి శరీరంపై బుల్లెట్ తూటాల తూట్లు గల చిత్రాలతో కూడిన వీడియోను ప్రసారం చేసింది. మృతి చెందిన పడి ఉన్న అంగరక్షకుల మధ్య పడి ఉన్న బాలచంద్రన్‌ను ఆ చానెల్ చూపించింది.

బాలచంద్రన్ ఎదురు కాల్పుల్లో మరణించాడని శ్రీలంక సైన్యం ప్రకటిస్తూ వస్తోంది. ప్రస్తుత ఛాయాచిత్రాలతో శ్రీలంక సైన్యం ప్రవర్తనను, వ్యవహార శైలిని బయటపెడుతోంది. బంకర్‌లో కూర్చున్న బాలచంద్రన్‌ను శ్రీలంక ఆర్మీ పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2009లో ఎల్టిటిఇని అంతం చేయడానికి శ్రీలంక ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సందర్భంగా ఈ చిత్రాలను తీశారు. బాలచంద్రన్ ఎదురు కాల్పుల్లో చనిపోలేదని చెప్పడానికి ఈ ఫొటోలు చక్కటి ఉదాహరణలని అంటున్నారు.

షాకింగ్ పిక్చర్స్: ప్రభాకరన్ కుమారుడిని ఇలా చంపారు

బంకర్‌లో 12 ఏళ్ల బాలచంద్రన్ చొక్కా లేకుండా తన శరీరాన్ని లుంగీతో కప్పుకుని ఉన్నాడు. అతని ఐదుగురు అంగరక్షకులను హతం చేసిన తర్వాత శ్రీలంక సైన్యం అతన్ని ఇక్కడ పెట్టినట్లు భావిస్తున్నారు. తినడానికి అతనికి బిస్కట్లు ఇచ్చారు.

షాకింగ్ పిక్చర్స్: ప్రభాకరన్ కుమారుడిని ఇలా చంపారు

బాలచంద్రన్ ఛాతీపై ఐదు సార్లు కాల్పులు జరిపినట్లు వెల్లడిస్తున్న చిత్రం

షాకింగ్ పిక్చర్స్: ప్రభాకరన్ కుమారుడిని ఇలా చంపారు

బాలచంద్రన్‌ను శ్రీలంక ఆర్మీ అత్యంత కిరాతకంగా చంపిందని, దీన్ని నిరూపించడానికి తాము మరిన్ని ఫొటోలను బయటపెడతామని చానెల్ 4 అంటోంది.

షాకింగ్ పిక్చర్స్: ప్రభాకరన్ కుమారుడిని ఇలా చంపారు

శరీరంపై బుల్లెట్ల తూట్లతో పడి ఉన్న 12 ఏళ్ల బాలచంద్రన్ దేహం. అంగరక్షకుల పక్కన అతని మృతదేహం పడి ఉంది. కళ్లకు గంతలు కట్టి అతని అంగరక్షకులను చంపినట్లు అక్కడి దుస్తులు తెలియజేస్తున్నాయి.

షాకింగ్ పిక్చర్స్: ప్రభాకరన్ కుమారుడిని ఇలా చంపారు

గంతలు కట్టి అంగరక్షుకులను చంపుతున్న దృశ్యాలను బాలచంద్రన్‌కు చూపించినట్లు తెలుస్తోంది. అంగరక్షకులను చంపిన తర్వాత శ్రీలంక సైనికులు బాలచంద్రన్‌పైకి కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+