హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాకంటే నాకు: యాత్రలోనూ బాబు ముందు పెద్ద లిస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ ఎన్నికల కష్టాలు ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది. ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీపడుతున్న ఆశావహుల సంఖ్య పార్టీలో చాలా ఉంది. రోజుకొకరు ఆశావహుల చిట్టాలో చేరుతున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు అధినేత చంద్రబాబును కలిసి తమ అర్హతలను వివరిస్తూ ఓ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

మహబూబ్‌నగర్‌కు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ తాజాగా రేసులోకి ప్రవేశించారు. తెలంగాణలో మిగిలిన బిసి కులాలకు తగినంత ప్రాతినిధ్యం ఉన్నా ముదిరాజ్ కులానికి మాత్రం తగినంత లేదని, ఆ సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోటేశ్వర రావు కొద్ది రోజుల క్రితం పార్టీ అధ్యక్షుడిని కలిసి తన పేరును ఎమ్మెల్సీకి పరిశీలించాలని కోరారు.

తన నియోజకవర్గం రిజర్వు అయిందని, తనకు ఏదైనా పదవి ఉంటే జిల్లాలో పార్టీని సమన్వయపర్చే బాధ్యతను మరింత మెరుగ్గా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని ఆయన పార్టీ అధ్యక్షుడికి చెప్పారట. అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత మరో నేత కూడా తన పేరును పరిశీలించాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడికి లేఖ పంపినట్లుగా తెలుస్తోంది. బాబు వస్తున్నా మీకోసం పాదయాత్రలో పాల్గొంటున్న వికలాంగుల విభాగం నేత కూడా తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని అధినేతను కోరారు.

వికలాంగుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చిన అధినేత ఎమ్మెల్సీ పదవి తనకు ఇస్తే మరింత బాగుంటుందని చెబుతున్నారట. వీరే కాకుండా పలు జిల్లాల నుండి చాలామంది నేతలు బాబును స్వయంగా కలిసి లేదా మాట్లాడి ఎమ్మెల్సీని అభ్యర్థిస్తున్న లిస్టులో ఉన్నారు.

English summary
Telugudesam Party leaders are urging chief Nara Chandrababu Naidu about MLC tickets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X