పిక్చర్స్: చిద్దూ బడ్జెట్, ఫ్యామిలీ పదనిసలు, ఫిక్కీ ఆసక్తి
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం తన బడ్జెట్ ద్వారా సమ్మిళిత వృద్ధిని ఆశించారు. బడ్జెట్‌ను ప్రతిపాదించిన తర్వాత చిదంబరం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. దీర్ఘ కాలంలో బంగారం దిగుమతుల్లో నియంత్రణ అవసరమని ఆయన అన్నారు.
బడ్జెట్ రూపకల్పనలో ప్రధానంగా మూడు అంశాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పారు. రేంద్ర బడ్జెట్‌ను వాణిజ్య వర్గాలు కూడా స్వాగతిస్తున్నాయని ఆయన చెప్పారు. 8 శాతం వృద్ధిరేటును సాధించడమే తమ ముందున్న సవాల్ అని ఆయన అన్నారు. ఆర్థిక వ్యయ నియంత్రణకే బడ్డెట్‌లో ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు చిదంబరం చెప్పారు.
దీర్ఘకాలంలో ఎగుమతుల పెరుగుదల ద్వారనే ద్రవ్యలోటు తగ్గే అవకాశం ఉందని ఆయన అన్నారు. బడ్జెట్‌పై చర్చలో మరిన్ని నిర్ణయాలు ప్రకటిస్తామని చెప్పారు.

పార్లమెంటులో ప్రతిపాదనకు ముందు 2013 -14 వార్షిక బడ్జెట్‌కు తుది రూపు ఇస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం.

పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రతిపాదించడానికి బయలుదేరిన పి. చిదంబరం మనవరాలు అదితి నళిని నుంచి శుభాకాంక్షలు అందుకుంటున్న దృశ్యం.

బడ్జెట్ ప్రసంగం వినడానికి పార్లమెంటుకు వస్తున్న చిదంబరం కుటుంబ సభ్యులు.

పార్లమెంటులో బడ్జెట్ ప్రతిపాదించడానికి ఇంటి నుంచి బయలుదేరిన చిదంబరం.

బడ్జెట్ ప్రతిపాదనకు ముందు చిదంబరం, సహాయ మంత్రులు ఎన్ఎన్ మీనా, ఎస్ఎస్ పళనిమాణిక్యం, తన జట్టుతో కార్యాలయంలోకి వెళ్తున్న దృశ్యం.

బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజీలో బడ్జెట్ ప్రభావాన్ని స్క్రీన్ ప్రదర్శనపై చూస్తున్న ఇన్వెస్టర్లు.

లోకసభలో గురువారం బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్న చిదంబరం.

లోకసభలో బడ్జెట్‌ను చిదంబరం ప్రతిపాదిస్తుంటే, ఆయన ప్రతిపాదనలపై ప్రధాని మన్మోహన్ సింగ్, బిజెపి ఎంపి యశ్వంత్ సిన్హా జాగ్రత్తగా దృష్టి కేంద్రీకరించిన వైనం..

లోకసభలో బడ్డెట్‌ను ప్రతిపాదిస్తున్న చిదంబరం. ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, స్పీకర్ మీరా కుమార్, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ కూడా చిత్రంలో ఉన్నారు.

చిదంబరం బడ్జెట్ ప్రసంగం సందర్భంగా రాహుల్ గాంధీ ఇలా..

పార్లమెంటు హౌస్‌లో గురువారం బడ్జెట్ ప్రతిపాదన సందర్భంగా సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, బిజెపి నేతలు సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ.

పార్లమెంటు హౌస్‌లో బిజెపి నేత సుష్మా స్వరాజ్‌తో ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్.

న్యూఢిల్లీలోని తమ కార్యాలయంలో బడ్జెట్ ప్రతిపాదనలను చూస్తున్న ఫిక్కీ సభ్యులు.

బడ్జెట్ ప్రతిపాదనలను స్క్రీన్‌పై చూస్తూ ఫిక్కి ఆధ్యక్షుడు నైనా లాల్ కిద్వాయ్, మాజీ అధ్యక్షుడు ఆర్‌వి కనోరియా, కార్యదర్శి ఎ దిదార్ సింగ్ ప్రతిస్పందిస్తూ.

కేంద్ర బడ్జెట్ 2013 - 2014.

కేంద్ర బడ్జెట్ 2013 - 14.

సభ్యులకు పంపిణీ చేయడానికి ముందు బడ్జెట్ ప్రతుల కట్టలను తనిఖీ చేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications