వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ ఐఎస్ఐకి పేలుళ్ల గుట్టు చెప్పిన ఎన్ఎస్‌జీ అధికారి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad blasts information leaked to Pak
న్యూఢిల్లీ: హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్ పేలుళ్ల అనంతర పరిణామాలపై ఉగ్రవాద నిరోధక సంస్థ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్(ఎన్ఎస్‌జీ) అధికారి ఒకరు పాకిస్థాన్ ఐఎస్ఐ ఏజెంట్‌తో అనధికారికంగా మాట్లాడినట్టు వెలుగులోకి వచ్చింది. ఎన్ఎస్‌జీ అధికారుల హైదరాబాద్ పర్యటన వివరాలను ఆ అధికారి వెల్లడించినట్లు తెలిసింది. ఈ ఘటనపై ఎన్ఎస్‌జీ దర్యాప్తునకు ఆదేశించింది. సదరు అధికారి ఎన్ఎస్‌జీలోని బ్లాక్ క్యాట్స్ విభాగంలో పని చేస్తున్నారని, ఆయన మేజర్ ర్యాంకు అధికారి అని, ఆర్మీ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చారని ఎన్ఎస్‌జీ వర్గాలు తెలిపాయి.

ఈ ఘటన కొద్ది రోజుల కిందట జరిగిందని, దీనిపై అంతర్గతంగా దర్యాప్తునకు ఆదేశించామని ఎన్ఎస్‌జీ అధిపతి అరవింద్ రంజన్ తెలిపారు. ఎన్ఎస్‌జీ అధికారి, పాకిస్థానీ మధ్య సంభాషణ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కీలక వివరాలను వెల్లడించలేదని తెలిపారు. పాకిస్థానీని ఐఎస్ఐ ఏజెంట్‌గా భావిస్తున్నామన్నారు.

ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు జరిగిన వెంటనే కేవలం మూడున్నర గంటల్లోనే ఎన్ఎస్‌జీ అధికారులు హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, పేలుళ్ల స్థలానికి ఎన్ఎస్‌జీ బృందం కదలికల గురించి సదరు అధికారి ఐఎస్ఐ ఏజెంటుకు వివరించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతే తప్పితే, పేలుళ్లకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఏవీ తెలియజేయలేదని వివరించాయి. వాళ్లిద్దరూ ఫోన్లో మాట్లాడుకున్నారని, కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు దీనిని కనుగొన్నారని, వారి సంభాషణ వివరాలను ఎన్ఎస్‌జీ ప్రధాన కార్యాలయానికి వివరించారని ఆ వర్గాలు తెలిపాయి.

అయితే, నిఘా, భద్రతా సంస్థల్లో ఇటువంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉంటాయని, గుర్తు తెలియని వ్యక్తులతో ఫోన్లో కానీ, వ్యక్తిగతంగా గానీ, ఇంటర్నెట్ తదితర సమాచార సాధనాల్లో కానీ మాట్లాడవద్దని అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేస్తూనే ఉంటారని ఆ వర్గాలు వివరించాయి.

English summary
An officer of NSG has talked to a Pakistani on Hyderabad bomb blasts. Enquiry has been ordered on this incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X