ఏ భార్యపై ప్రమాణం, గీతను మోసగించి: అనిల్‌పై రేవంత్

Anil Kumar-Revanth Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అక్రమాలు చేయలేదని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, జగన్ సోదరి షర్మిల, బావ బ్రదర్ అనిల్ కుమార్‌లు బైబిల్ పైన ప్రమాణం చేస్తారా? అని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి గురువారం ప్రశ్నించారు.

తాము చేసిన ఆరోపణలపై సమాధానాలు చెప్పకుండా అక్రమాలు చేయలేదని తాను భార్యా బిడ్డలపై ప్రమాణం చేస్తానని, బైబిల్ పైన ప్రమాణం చేస్తానని బ్రదర్ అనిల్ కుమార్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తనకు బినామీలు ఉన్నారా? లేరా? ఆయా కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయా? అనే విమర్శలపై మొదట అనిల్ సమాధానం ఇవ్వాలన్నారు. ఆ తర్వాత ప్రమాణం చేసుకోవచ్చునని చెప్పారు.

భార్య పైన ప్రమాణం చేస్తానని చెప్పిన అనిల్ కుమార్ ఏ భార్య పైన ప్రమాణం చేస్తారని ప్రశ్నించారు. సొంత భార్యా బిడ్డలను మోసం చేసి మరో భార్యాబిడ్డలతో ఉంటున్న అనిల్ ఏ భార్యాబిడ్డలపై ప్రమాణం చేస్తారన్నారు. పవిత్రమైన బైబిల్‌ను పట్టుకొని అనిల్ కుమార్ అబద్దాలు చెప్పడం మానుకుంటే మంచిదని సూచించారు. మత ప్రబోధకుడికి రాజకీయాలతో అవసరం ఏమిటని ప్రశ్నించారు.

రాజకీయాలు మాట్లాడుతున్న అనిల్ కుమార్ మత ప్రబోధకుడిగా అనర్హుడు అన్నారు. అనిల్ అబద్దాలు చెబుతున్నారన్నారు. భగవద్గీతను మోసం చేసి బైబిల్‌ను చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఆయన ఇలాగే అబద్దాలు చెప్పి ఉంటారని విమర్శించారు. ఇప్పుడు పవిత్ర బైబిల్‌తో కూడా అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు. అనిల్, జగన్‌లు అబద్దాలు మాని నిజాలు చెబితే శిక్ష తగ్గే అవకాశముందన్నారు. ద్విపాత్రాభినయం చేస్తున్న అనిల్ మత ప్రబోధకుడా లేక రాజకీయ నాయకుడా తేల్చుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+