మరో ట్విస్టు: నటి కవిత కూతురితో మూడో పెళ్లి

Another twist: It is third marriage
హైదరాబాద్: సినీ నటి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు కవిత కూతురు మాధురి ప్రేమ వివాహం మరో మలుపు తిరిగింది. మాధురితో రాజుకు ఇదే మూడో పెళ్లి అని అంటున్నారు. రాజుకు తాము భార్యలమంటూ మరో ఇద్దరు మహిళలు రంగంలోకి దిగారు. కరీంనగర్ జిల్లాకు చెందిన అన్నపూర్ణ అనే మహిళ, హైదరాబాదులోని వారాసిగుడాకు చెందిన జయశ్రీ అనే మహిళ హైదరాబాదులోని పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రెండో భార్య జయశ్రీ తన ఏడాది బిడ్డతో పోలీసు స్టేషన్‌కు వచ్చింది. రాజు 2005లో అన్నపూర్ణను, 2008లో జయశ్రీని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కూడా ప్రేమ వివాహాలే కావడం విశేషం. వివాహం చేసుకోవడంలో కూడా రాజు ఒకే పద్ధతిని అనుసరించాడు. వారిద్దరిని కూడా మాధురిని ఎత్తుకెళ్లినట్లే ఎత్తుకెళ్లి వివాహం చేసుకున్నట్లు సమాచారం. శుక్రవారం వరకు మాధురితో ప్రేమ వివాహం విషయంలో రాజు అమాయకుడిగా కనిపిస్తూ వచ్చాడు. మరో ఇద్దరు మహిళలు రంగంలోకి దిగడంతో అతను నిత్య పెళ్లికొడుకు అనే వ్యవహారం బయటకు వచ్చింది.

తమ ఆపార్టుమెంట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు తనను బెదిరించి కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి తీసుకుని వెళ్లాడని ఆమె ఆరోపించిన విషయం తెలిసిందే. ఇంట్లో నుంచి 15 లక్షల రూపాయలు తెచ్చివ్వాలని, లేదంటే అమ్మకు, కుటుంబ సభ్యులకు హాని తలపెడతానని రాజు తనను బెదిరించినట్లు ఆమె చెప్పింది.

కూల్ డ్రింక్ తాగిన తర్వాత తనను ఎక్కడికి తీసుకుని వెళ్లింది కూడా తనకు తెలియదని, గుడిలోకి తీసుకుని వెళ్లి బలవంతంగా తాళి కట్టాడని ఆమె చెప్పింది. పోలీసుల సహకారంతో తాను తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరుకున్నానని ఆమె చెప్పింది. ఫిర్యాదు చేసిన 24 గంటల లోపే తన కూతురుని ఇంటికి చేర్చిన పోలీసులకు కవిత కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+