సిఎం పదవి కోసం ప్రయత్నించలేదు: జానా రెడ్డి

ఈ సమయంలో అక్కడకు చేరిన మీడియా ప్రతినిధులతో జానా రెడ్డి మాట్లాడారు. కొందరు ముఖ్యమంత్రి పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నా వారిని ఎవరూ పట్టించుకోవడం లేదని, కాని తాను ప్రయత్నం చేయనప్పటికీ ప్రచారం జరగుతోందని ఆయన అన్నారు.
తనపై అసత్య ప్రచారం చేస్తూ న్యాయస్థానంలో కేసు దాఖలు చేయడం వెనుక పార్టీ నేతల హస్తం ఉండే అవకాశాలున్నాయని జానారెడ్డి సందేహం వ్యక్తం చేశారు. జానారెడ్డి అక్రమాస్తులపై సిబిఐ, ఈడిలతో విచారణ జరిపించాలని కోరుతూ ఇటీవల కోర్టులో పిటిషన్ దాఖలైంది.
రాజకీయాలు ఐపీఎల్ లాంటివి : ఆదినారాయణ రెడ్డి
రాజకీయాలు ఐపీఎల్ మ్యాచ్‌ల్లాంటివని జమ్మలమడుగు ఎమ్మెల్యే అదినారాయణ రెడ్డి సూత్రీకరించారు. అసెంబ్లీ లాబీల్లో జాతీయ టీమ్‌లో ఒక్కటిగా ఆడినవారే ఐపీఎల్‌లో ప్రత్యర్ధులుగా పోటీ పడతారు. సహకార ఎన్నికల్లో వీరాశివారెడ్డికి సహకరించనని సీఎం కిరణ్ కుమార్ రెడ్డికే చెప్పానని అన్నారు. తాను అవిశ్వాసానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications