ప్రియుడ్ని చంపి ప్రియురాలూ..: సెక్స్ రాకెట్ గుట్టు రట్టు

 Lovers dead in Khammam
హైదరాబాద్/ఖమ్మం: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఓ సెక్స్ రాకెట్ గుట్టు రట్టయింది. నగరంలోని బంజారాహిల్స్‌లో ఈ రాకెట్ గుట్టు రట్టయింది. నిర్వాహకులు, విటుడు, అమ్మాయిలు పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు నిర్వాహకులను, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం.

ప్రేమికులు మృతి

ఖమ్మం జిల్లాలోని గుండాల మండలం నర్కొడులో ప్రేమికుల జంట మృతి చెందింది. చనిపోయిన వారిని గుర్తించారు. మృతుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొన్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు ప్రియుడు ప్రేమ పేరుతో మోసం చేసినందువల్లే ప్రియురాలు అతనిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా కూడా చెబుతున్నారు.

మహిళ ఆత్మహత్య

హైదరాబాదులోని దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో కనక అనే మహిళ ఆదివారం ఉదయం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్తే కారణమంటూ బంధువులు పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.

లాయర్ చావు తెలివి తేటలు

నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఓ లాయరు 'చావు' తెలివి తేటలు ప్రదర్శించారు. చీటింగ్ కేసులో ఓ నిందితుడిని కాపాడేందుకు అతను చనిపోయినట్లు కోర్టుకు ధృవీకరణ పత్రం ఇచ్చాడు. పోలీసుల విచారణలో నిందితుడు చనిపోలేదని తెలిసిందే. లాయర్ మోసం తెలియడంతో పోలీసులు అతనిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+